రిషి వెళ్ళిపోయాక ఒంటరైన భావన కలుగుతోందిః నీతూ కపూర్‌ భావోద్వేగం

Published : Nov 17, 2020, 08:13 AM IST
రిషి వెళ్ళిపోయాక ఒంటరైన భావన కలుగుతోందిః నీతూ కపూర్‌ భావోద్వేగం

సారాంశం

నీతూ కపూర్‌ ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్‌ సిరీస్‌ `రామ్‌ బరణ్‌ సింగ్‌ః ది ఫ్యామిలీ ఆఫ్‌ ఆన్‌టోల్డ్ స్టోరీ`లో మెరిసింది. ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జియో` అనే సినిమాలోనూ  కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

నీతూ కపూర్‌.. 1970, 80 దశకాల్లో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన స్టార్‌ హీరోయిన్‌. మాక్సిమమ్‌ బాలీవుడ్‌ అగ్ర నటులతో ఆడిపాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, పాపులారిటీని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ అందాల నటుడు రిషికపూర్‌ని మ్యారేజ్‌ చేసుకున్నాక.. కూడా దాదాపు పదేళ్లపాటు హీరోయిన్‌గా నటించి మెప్పించారు. పిల్లలు(రణ్‌బీర్‌ కపూర్‌) పుట్టాక క్రమంగా సినిమాలు తగ్గించింది. అడపా దడపా చేసుకుంటూ వచ్చిన నీతూ.. 2013 తర్వాత పూర్తిగా మానేసింది. 

తాజాగా నీతూ కపూర్‌ ఈ ఏడాది రీఎంట్రీ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ కోసం వెబ్‌ సిరీస్‌ `రామ్‌ బరణ్‌ సింగ్‌ః ది ఫ్యామిలీ ఆఫ్‌ ఆన్‌టోల్డ్ స్టోరీ`లో మెరిసింది. ఇప్పుడు `జగ్‌ జుగ్‌ జియో` అనే సినిమాలోనూ  కీలక పాత్ర పోషిస్తుంది. అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం నీతూ ఈ చిత్ర షూటింగ్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

ఆమె భర్త, సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఒంటరై పోయింది. భర్తను కోల్పోయిన ఆమె సెట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. `చాలా రోజుల తర్వాత సినిమా సెట్‌లో అడుగుపెట్టాను. ఏదో తెలియని భయం, ఒంటరిగా ఉన్న భావన కలిగించింది. సినిమా చేయడం కొత్త ప్రారంభంలా ఉంది. సినిమా మ్యాజిక్‌ ఇలానే ఉంటుందనుకుంటా. రణ్‌బీర్‌ ఉన్నాడనే ధైర్యంతో ముందుకెళ్తున్నా. ఇప్పుడు నాకు నేను అన్ని విషయాలు తెలుసుకుంటున్నా. మీరు ఏ లోకంలో ఉన్నా నాకు అండగా ఉంటారని నమ్ముతున్నా` అని రిషికపూర్‌ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని పంచుకుంది. 

దీనిపై బాలీవుడ్‌ సెలబ్రిటీలు అనిల్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, రిద్దిమా, మనీష్‌ మల్హోత్రా, వరుణ్‌ ధావన్‌ వంటి వారు స్పందించి తాము అండగా నిలుస్తామని నీతూలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇక నీతూ పంచుకున్న ఫోటోలో ఆమె సినిమా షూటింగ్‌ కోసం రెడీ అవుతున్నారు. మేకప్‌ వేసుకుంటున్నట్టుగా ఆ ఫోటో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా