రానా తెలివికి.. ఇండస్ట్రీ వర్గాలు ఫిదా!

By Udayavani DhuliFirst Published Sep 5, 2018, 3:56 PM IST
Highlights

రానా దగ్గుబాటి వ్యాపార ఆలోచనల్లో తన తండ్రిని సైతం మించిపోతున్నాడనే చెప్పాలి. 'కేరాఫ్ కంచరపాలెం' అనే చిన్న సినిమాను నిర్మించి సినిమా విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటున్నాడు. 

రానా దగ్గుబాటి వ్యాపార ఆలోచనల్లో తన తండ్రిని సైతం మించిపోతున్నాడనే చెప్పాలి. 'కేరాఫ్ కంచరపాలెం' అనే చిన్న సినిమాను నిర్మించి సినిమా విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటున్నాడు. నిజానికి ఈ సినిమాని ఎన్నారై కార్డియాలజిస్ట్ ప్రవీణ పరుచూరి కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.

రిలీజ్ కోసం సురేష్ బాబు ప్రొడక్షన్స్ ను సంప్రదించగా.. విమర్శకుల ప్రశంసలను అందుకునే సినిమా అవుతుందని ఊహించిన రానా వెంటనే సినిమాకు సమర్పకుడిగా మారిపోయాడు. అలా అని ఈ సినిమాపై రానా ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. తనకున్న కాంటాక్ట్స్, పేరుని వాడుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడు. అంతే.. సినిమాకు ఎక్కడా లేని బజ్ వచ్చేసింది.

రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుండి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా ప్రివ్యూ చూసి తెలుగు సినిమా చరిత్రలో చక్కటి ప్రయోగమంటూ కొనియాడుతున్నారు. ఈ సినిమాను నిర్మించడానికి మొత్తంగా రూ.75 లక్షలు ఖర్చయిందట. ఎలా లేదన్నా..ఈ సినిమాకు శాటిలైట్ రూపంలోనే కోటికి పైగా వస్తుంది.. డిజిటల్ రైట్స్ ఎలానూ ఉంటాయి. మొత్తానికి జీరో ఇన్వెస్ట్మెంట్ తో కోట్లు ఎలా సంపాదించాలో.. రానాను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి..

రివ్యూ: C/o కంచరపాలెం

click me!