"దెయ్యమా.. మజాకా" ట్రైలర్ లాంచ్ చేసిన కోడి రామకృష్ణ

Published : Feb 08, 2017, 08:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
"దెయ్యమా.. మజాకా" ట్రైలర్ లాంచ్ చేసిన కోడి రామకృష్ణ

సారాంశం

"దెయ్యమా.. మజాకా" ట్రైలర్ లాంచ్ చేసిన కోడి రామకృష్ణ

 

భీమవరం టాకీస్ పతాకంపై కె.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "దెయ్యమా మజాకా". మానస్, అఖిల్, నీహారిక, మేఘన, నవీన్ ముఖ్య తారాగణంగా.. సంపత్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. తనకు చిరకాల మిత్రుడైన రామ సత్యనారాయణ నిర్మిస్తున్న  "దెయ్యమా మజాకా" మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

 

ఓ నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వీకెండ్ పార్టీ నుంచి వస్తూ.. మద్యం మత్తులో.. నాలుగేళ్ల కుమార్తెతో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న ఓ జంట ప్రయాణిస్తున్న కారును గుద్దేస్తారు. ప్రమాదంలో తల్లిదండ్రులిద్దరూ మరణిస్తారు. తనలాగే తన బిడ్డ అనాధ కాకూడదనే తపన కలిగిన ఆ బిడ్డ తల్లి ఆత్మగా మారుతుంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల సమాహారమే "దెయ్యమా మజాకా" అని, దర్శకుడు సంపత్ రాజ్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడని, కోడి రామకృష్ణ వంటి గ్రేట్ డైరెక్టర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న "దెయ్యమా మజాకా" ఘన విజయం సాధించడం తధ్యమని నిర్మాత రామ సత్యనారాయణ అన్నారు. 

 

ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్.ఎస్, ఎడిటింగ్: హరీష్ కుమార్, మ్యూజిక్: నవనీత్ చారి, సమర్పణ: ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ రాజ్ !!

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు