మేనల్లుడి దరువు చూసి మురిసిపోతున్న దేవిశ్రీప్రసాద్!

By AN TeluguFirst Published 22, May 2019, 11:24 AM IST
Highlights

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దేవిశ్రీప్రసాద్ ఇటీవల 'మహర్షి' సినిమాకి మ్యూజిక్ అందించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. 

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న దేవిశ్రీప్రసాద్ ఇటీవల 'మహర్షి' సినిమాకి మ్యూజిక్ అందించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. తాజాగా దేవి సోషల్ మీడియాలో తన మేనల్లుడి వీడియో ఒకటి షేర్ చేశాడు.

ఈ వీడియోలో దేవిశ్రీప్రసాద్ మేనల్లుడు తానవ్ సంగీత వాయిద్యాలను ముందు పెట్టుకొని డప్పుపై దరువేస్తున్నాడు. రెండున్నరేళ్ల తానవ్ డప్పు కొట్టడం చూసిన దేవి ఆనందంతో మురిసిపోయాడు. తానవ్ దరువు కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా.. ''నా మేనల్లుడు తానవ్ సత్యకి సంగీతం నేర్పించకుండానే దరువు వేయడం ప్రారంభించాడు. స్వయంగా వాడే నేర్చుకుంటున్నాడు. నెలల బాబుగా ఉన్నప్పటి నుండి వాడే దరువు వేస్తున్నాడు. ఇప్పుడు వాడి వయసు రెండున్నరేళ్లు.. వాడి పెర్ఫార్మన్స్ సర్ప్రైజ్ గా ఉంది. ఇది మా నాన్న ఆశీర్వాదంతోనే జరుగుతుంది'' అంటూ ట్వీట్ చేశారు.

తానవ్ సత్య తీరు చూస్తుంటే ఇప్పటినుండే మేనమామ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. మరి భవిష్యత్తులో తన మామని మించిపోతాడేమో చూడాలి!

Nobody taught him..He learnt himself.. Even Iam surprised 😁🎶❤️👏🏻🎵

He is jst abt 2.5 yrs..
He started doing this wn he was jst a few months baby..Now he is on Tempo😁❤️🎶

With my Dad’s Blessings🙏🏻❤️🙏🏻 pic.twitter.com/A9kuvjocwl

— DEVI SRI PRASAD (@ThisIsDSP)
Last Updated 22, May 2019, 11:24 AM IST