`దేవిశ్రీప్ర‌సాద్` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఆలీ

Published : Feb 04, 2017, 04:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
`దేవిశ్రీప్ర‌సాద్` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఆలీ

సారాంశం

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన థ్రిల్లర్ ఎంటర్ టైనర్ `దేవిశ్రీప్ర‌సాద్‌` ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌ `దేవిశ్రీప్ర‌సాద్` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన స్టార్ క‌మెడియ‌న్ అలీ

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా  స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవిశ్రీప్ర‌సాద్‌`.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను స్టార్ క‌మెడియ‌న్ అలీ విడుద‌ల చేశారు.

 

ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ - ``మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ న‌టించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. మ‌రి ఈ టైటిల్ వెనుక క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మోష‌న్ పోస్ట‌ర్ ఇంకా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

 

చిత్ర నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ మాట్లాడుతూ - ``మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే