దసరాకి `దేవర`.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే.. ఎన్టీఆర్‌ కొత్త పోస్టర్‌ అదిరింది..

By Aithagoni Raju  |  First Published Feb 16, 2024, 4:44 PM IST

ఎన్టీఆర్‌ `దేవర` విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ మూవీ వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వాయిదా వేశారు. అదే సమయంలో కొత్త డేట్‌ కూడా ప్రటించారు.


`దేవర` విషయంలో అనుకున్నదే జరిగింది. సినిమా వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్‌ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్‌ హీరోగా `దేవర` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది రెండు పార్ట్ లుగా రానుంది. మొదటి పార్ట్ ఈ దసరాకి విడుదల చేయబోతున్నారు. మొదటగా ఈ మూవీని ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్టు ప్రారంభంలోనే ప్రకటించారు. 

కానీ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే కావడం కారణంగా వాయిదా వేస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వచ్చాయి. దీనికితోడు ఏపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనూ ఈ మూవీని వాయిదా వేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కారణాలేమైనా ఈ మూవీని తాజాగా పోస్ట్ పోన్‌ చేసింది యూనిట్‌. అయితే `పుష్ప2` రాకపోతే ఆగస్ట్ 15న రావాలని అనుకున్నారు. కానీ `పుష్ప2` టీమ్‌ తగ్గడం లేదు. ఆ డేట్‌కి రావాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఆ దిశగానే ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో దసరాకి ఫిక్స్ చేసుకున్నారు `దేవర` మేకర్స్. 

Latest Videos

కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీ రూపొందుతుంది. ఇది రెండు భాగాలుగా రిలీజ్‌ చేస్తున్నారు. మొదటి పార్ట్ ని అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా ఫలితాన్ని బట్టి రెండో పార్ట్ చేసే అవకాశం ఉంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు కొరటాల. సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌లో మూవీ సాగుతుందని తెలుస్తుంది. ఓ పోర్ట్ ప్రధానంగానే సినిమా సాగుతుందని తెలుస్తుంది. తండ్రి నిర్మించిన పోర్ట్ ని దుండగులు స్వాధీనం చేసుకుంటే దాన్ని కాపాడేందుకు కొడుకు చేసే పోరాటం ప్రధానంగా సినిమా కథ నడుస్తుంది తెలుస్తుంది. 

Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7

— Jr NTR (@tarak9999)

తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌ అదిరిపోయింది. గతంలో ఎన్టీఆర్‌ బ్లాక్‌ డ్రెస్సుల్లో కనిపించారు. బోట్‌లో బ్లాక్‌ షర్ట్ ప్యాంట్‌ ధరించి ఓ లుక్‌, బ్లాక్‌ షర్ట్, బ్లాక్‌ లుంగీలో ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అవి ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు విడుదల చేసిన లుక్‌లో తారక్‌ కాస్త యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇందులో తారక్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. అలాగే సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. తండ్రిగా, కొడుకుగా కనిపిస్తారట. మరో హీరోయిన్‌గా మరాఠి భామని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. 

Read more: ముంబయి హార్బర్‌లో సుజీత్ తో పవన్‌.. ఏం జరుగుతుంది?.. `ఓజీ` ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..
 

click me!