'దేవదాస్'లో నాగార్జున మరింత స్టైలిష్ గా!

Published : Aug 28, 2018, 06:04 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
'దేవదాస్'లో నాగార్జున మరింత స్టైలిష్ గా!

సారాంశం

సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాటు నాని కూడా నటిస్తున్నాడు

సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాటు నాని కూడా నటిస్తున్నాడు. నాగార్జున.. దేవ అనే డాన్ పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ తో సినిమాపై హైప్ బాగా పెరిగింది.

తాజాగా నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) సందర్భంగా చిత్రబృందం ఒక స్టిల్ రిలీజ్ చేసింది. అందులో నాగార్జున మరింత స్టైలిష్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అతడి కాస్ట్యూమ్స్, టోపీ, కళ్లజోడు హాలీవుడ్ స్టార్ ని తలపిస్తున్నాయి.

నాగార్జున అభిమానులకు ఈ పోస్టర్ మంచి కానుకనే చెప్పాలి. ఇది వరకు చూడనంత స్టైలిష్ అవతారంలో వెలిగిపోతున్నాడు మన్మధుడు. రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు