నా ఫ్రెండ్స్ లో చాలా మంది గే లు ఉన్నారు.. నాగశౌర్య కామెంట్స్!

Published : Aug 28, 2018, 05:42 PM ISTUpdated : Sep 09, 2018, 01:49 PM IST
నా ఫ్రెండ్స్ లో చాలా మంది గే లు ఉన్నారు.. నాగశౌర్య కామెంట్స్!

సారాంశం

యంగ్ హీరో నాగశౌర్య 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత విడుదలైన 'అమ్మమ్మగారిల్లు' సినిమాకు ఏవరేజ్ మార్కులు పడ్డాయి

యంగ్ హీరో నాగశౌర్య 'ఛలో' చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఆ తరువాత విడుదలైన 'అమ్మమ్మగారిల్లు' సినిమాకు ఏవరేజ్ మార్కులు పడ్డాయి. తాజాగా శౌర్య నటించిన 'నర్తనశాల' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

నాగశౌర్య లాంటి అందగాడైన హీరో గే క్యారెక్టర్ లో ఎలా నటించగలిగాడు..? ఆ పాత్ర కోసం అతడు ఎంత కష్టపడ్డాడనే విషయంపై తాజాగా స్పందించాడు శౌర్య. ''గే పాత్రలో నటించడం నాకు కష్టమనిపించలేదు. నా స్నేహితుల్లో చాలా మంది గే లు ఉన్నారు. దాంతో వాళ్ల బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికింది. చాలా సార్లు బయటకి వెళ్లేప్పుడు కూడా పార్టీల్లో వాళ్లని కలుస్తుంటాను.

అందుకే ఆ పాత్ర పోషించడం నాకు కష్టంగా అనిపించలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాగశౌర్య. మరి తన నటనతో ఏ మేరకు నవ్విస్తాడో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?