దేవాకట్టా మరో సంచలనం `ఇంద్రప్రస్థం`.. ఆసక్తిరేపుతున్న పోస్టర్‌

Published : Aug 14, 2020, 08:30 AM IST
దేవాకట్టా మరో సంచలనం `ఇంద్రప్రస్థం`.. ఆసక్తిరేపుతున్న పోస్టర్‌

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై, ముప్పై ఏళ్ల కాల పరిమితిలో ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు, వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని, అందుకు దారి తీసిన అంశాలను ఇందులో చూపించబోతున్నారు దేవా కట్టా. 

`మహాప్రస్థానం`తో సంచలనం సృష్టించిన దేవా కట్టా మరో సంచలనానికి తెరలేపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్నేహం ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా శుక్రవారం సినిమాకి `ఇంద్రప్రస్థం` అనే టైటిల్‌ ఖరారు చేస్తూ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. 

ఈ పోస్టర్‌లో చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమ మార్క్ అభివాదం చేస్తున్న షేడ్‌ ఫోటోలను జోడించారు. వెనకాల  గొడవలను ప్రతిబింబిస్తున్నాయి. `నైతికత మారుతుంది. అధికారం కోసం జరిగే యుద్ధం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది` అని పోస్టర్‌ ఉన్న కొటేషన్‌ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రొడోస్‌ ప్రొడక్షన్స్ పతాకంపై హర్ష వీ, తేజ సీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాలపై, ముప్పై ఏళ్ల కాల పరిమితిలో ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు, వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని, అందుకు దారి తీసిన అంశాలను ఇందులో చూపించబోతున్నారు దేవా కట్టా. ఇందులో వాస్తవాలతో కాస్త కల్పితాన్ని, డ్రామాని జోడించి తెరకెక్కించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ సందర్భంగా దేవా కట్టా స్పందిస్తూ, పోటీకి చెందిన ఉద్దేశం గెలుపు.. విజేతలుగా నిలవడం. విజేతలు ప్రపంచాన్ని నడిపిస్తారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆటలో బరిలోకి దిగినప్పుడు ఆ ఆటకుండే మజానే వేరు. అది అత్యంత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారుతుంది` అని తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి