చదువులేకపోయినా గిన్నీస్‌ రికార్డ్‌.. గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి

By Satish ReddyFirst Published Jul 22, 2020, 4:02 PM IST
Highlights

ఓ మేథమోటీషియన్‌గా ఎలాంటి సాంప్రదాయ బద్ధమైన చదువులేకపోయినా ఆమె ఎన్నో గిన్నీస్‌ రికార్డ్‌ లను సాధించింది శకుంతలా దేవి. యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో ఆమె ఎంతో మంది మేదావులను తీర్చిదిద్దింది. ఆమె తన ఎబిలిటీస్‌ను ప్రదర్శిస్తూ ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.

హ్యామన్‌ క్యాలుక్యులేటర్‌గా పేరు పొందిన గణిత శాస్త్ర మేదావి శకుంతలా దేవి. ఎంతటి క్లిష్టమైన గణిత శాస్త్ర సమస్యనైనా క్షణాల్లో సాల్వ చేయగలిగటం ఆమె ప్రత్యేకత. విద్యార్థులకు మ్యాథ్స్‌ను అర్ధం చేసుకోవటం సులభతరం చేసేందుకు ఆమె ఎంతో కృషి చేసింది. ఆమె జీవితంలో సాదించిన విజయాలు, ఆమె జీవిత ప్రయాణాన్ని మరింత వన్నె తెచ్చే విధంగా ఆమె పేరుతోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బయోపిక్‌ ను రిలీజ్ చేస్తోంది.

ఓ మేథమోటీషియన్‌గా ఎలాంటి సాంప్రదాయ బద్ధమైన చదువులేకపోయినా ఆమె ఎన్నో గిన్నీస్‌ రికార్డ్‌ లను సాధించింది. యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌లో ఆమె ఎంతో మంది మేదావులను తీర్చిదిద్దింది. ఆమె తన ఎబిలిటీస్‌ను ప్రదర్శిస్తూ ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 1950లోనే యూరప్‌లో. 1976లో న్యూయార్క్‌ సిటీలో ప్రదర్శనలు ఇచ్చింది శకుంతలా దేవి. 1988లో కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో ఆమెకు ఉన్న అద్వితీయమైన ఎబిలిటీస్‌ మీద పరిశోదనలు కూడా జరిగాయి.

శకుంతలా దేవి సినిమా విషయానికి వస్తే అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ప్రొడక్షన్స్‌, విక్రమ్ మల్హోత్రాలు సంయుక్తం నిర్మించారు. ఈ సినిమాలో విద్యా బాలన్‌తో పాటు జిష్షు సేన్‌గుప్తా, సాన్య మల్హోత్రా, అమిత్ సాద్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెల 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.

click me!