థియేటర్ లో టపాసులు పేల్చి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ, రంగంలోకి దిగిన పోలీసులు

Published : Apr 07, 2023, 11:26 AM ISTUpdated : Apr 07, 2023, 11:29 AM IST
థియేటర్ లో టపాసులు పేల్చి..  అల్లు అర్జున్  ఫ్యాన్స్ రచ్చ, రంగంలోకి దిగిన పోలీసులు

సారాంశం

థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. డాన్స్ లు.. పేపర్లు.. ఈలలు..గోల వరకూ పర్వాలేదు కాని.. ఇంకాస్త ముందుకు వెళ్ళి.. టపాసులు కూడా పేల్చారు. దాంతో పొలీపులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. 

స్టార్ హీరోలంటే అభిమానం తలకెక్కడంతో.. కొంత మంది అభిమానులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఈక్రమంలో వారు చేసే పనులు ఆస్టార్ హీరోకి  చెట్టపేరు తీసుకొచ్చేలా ఉంటుంది. అలాంటిసంఘటనలు ఇప్పటికీ చాలా జరిగాయి. జరుగుతూనే  ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ అభిమానులు కూడా ఇలాంటి పనే చేశారు. అనవసరంగా ఓ థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది అసలు ఏంజరిగిందంటే.. 

ఈమధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగానడుస్తోంది.  సూపర్ స్టార్ మహేష్, పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు ఇప్పటికే అకేషన్ ప్రకారం రీరిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఇక ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు  సందర్భంగా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన దేశముదురు సినిమాను రెండు రోజుల ముందే రీరిలీజ్ చేశారు మేకర్స్.  ఏప్రిల్‌ 6న ఈ సినిమాను భారీ ఎత్తున రీరిలిజ్‌ చేయగా.. అల్లు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. అంతే కాదు గోలగోల చేశారు. 

అయితే కొన్ని చోట్ల ఈసినిమా రిలీజ్ వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. భారీగా అభిమానులు రావడంతో పాటు కొన్ని చోట్ల థియేటర్లలో  ఫ్యాన్స్‌ అత్యుత్సాహంతో చేసిన పనులు ఇబ్బందులకు గురిచేశాయి. చాలా మంది హీరోలకు సెంటిమెంట్ గా నిలిచిన ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని  సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. వచ్చిగోల చేసిన వారు చేసినట్టుు ఉండకుండా..లోపలే టపాసులు కూడా పేల్చి నానా హంగామా  చేశారు. దాంతో  కాస్త పోలీసులకు తెలియడంతో వారు వచ్చి షోను ఆపేశారు.

అయితే ఈ విషయం ముందుగా ఎవరికీ తెలియలేదు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ ట్వీట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంతేకాక అభిమానులు థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఆయన రికెస్ట్ చేశారు. దేవాలయాల్లాంటి థియేటర్‌లను రక్షించండి అని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది. 

పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా దేశముదురు.. ఈసినిమాతో బన్నీకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ సంసృతిని ఈ సినిమాతోనే అల్లు అర్జును తీసుకువచ్చారు. బన్నీ పర్ఫామెన్స్ తో పాటు.. ఆయన గ్లామర్ కుఅమ్మాయిలు విపరీతంగా ఫిదా అయిపోయారు. అంతే కాదు అల్లు అర్జున్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ఇక హన్సిక మోత్వాని ఈ సినిమాతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప-2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు.  రీసెంట్ గా పుష్ప ఎక్కడ? అంటూ  స్పెషల్ గ్లిప్ కూడా రిలీజ్ చేశారు టీమ్. పుష్పతో పాన్ఇండియాను టచ్ చేసిన అల్లు అర్జున్. ఈసారి అంతకు మించి చేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా జెండా పాతాలని ప్రయత్నంలో ఉన్నాడు అల్లు అర్జున్. మరి బన్నీ ప్రయత్నం ఏమౌతుందో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌