మరోసారి కెమెరా కంటికి చిక్కిన సిద్దార్ధ్ ‌- అదితిరావు హైదరి, కలిసి సినిమా చూసిన జంట

Published : Apr 07, 2023, 10:02 AM ISTUpdated : Apr 07, 2023, 10:04 AM IST
మరోసారి కెమెరా కంటికి చిక్కిన సిద్దార్ధ్ ‌- అదితిరావు హైదరి, కలిసి సినిమా చూసిన జంట

సారాంశం

మరోసారి జంటగా సందడి చేశారు  సిద్దార్ధ్ ‌- అదితిరావు హైదరి. ఈసారి ఇద్దరు కలిసి ఏం చక్కా ఓ సినిమా చూశారు. ఇప్పటికైనా వీరు డేటింగ్ లో ఉన్నారని గుర్తించండి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.   


 హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి... గత కొన్నాళ్లుగా వీరు  ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేసుకుంటున్నారు అని వార్తలు తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. చెన్నై వదిలి అదితి కోసం ముంబయ్ లో ఉంటున్నాడట సిద్థార్ద్. ఇద్దరు కలిసి  ముంబై వీధుల్లో షికార్లు చేస్తున్నారు. చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, డిన్నర్ పార్టీలు, లంచ్ పార్టీలు, సినిమాలు.. షికార్లు.. ఇలా అన్ని ప్లేస్ లకు కలిసి వెళ్తున్నారు. అంతే కాదు చివరికి వారిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన  శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా కలిసే జంటగా వచ్చారు. అక్కడితో ఆగితే బాగుండు.. కాని ఈ మధ్య ఓ ఫేమస్ సాంగ్ కు రీల్ కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. 

ఇలా సోషల్ మీడియాను కూడా కదిపితే వారు ఊరుకుంటారా..? అసలే ఎక్కడికి వెళ్ళినా.. కెమెరాల కంట పడుతూ.. దొరికిపోతూ వస్తున్న ఈ జంట.. ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నారు. దాంతో  వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని ఇప్పుడు అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఈ విషయంలో వీరిద్దరు స్పందించలేదు. ఖండించలేదు. దాంతో వీరి బంధం నిజమే అని ఫిక్స్ అవుతున్నారు జనాలు. రీసెంట్ గా మరోసారి ఇద్దరు జంటగా కనిపించి సందడి చేశారు. 

 

అదితి నటించిన జూబిలీ సిరీస్ ఈరోజు  నుంచి అమెజాన్  లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం  ముంబైలో జూబిలీ  సిరీస్ ప్రీమియర్ వేశారు. ఈ ప్రీమియర్ కు  అదితి రావు  సిద్దార్థ్ తో కలిసి జంటగా  వచ్చింది. వైట్ షర్ట్ లో సిద్దార్థ్ , బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో అదితి ఇద్దరు చూడముచ్చటైన జంటలా  కలిసి వచ్చి సందడి చేశారు. మీడియాకు ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా ఇచ్చారు.  అసలు నిజానికి ఈ సిరీస్ కి సిద్దార్థ్ కి సంబంధం లేదు. అయినా సరే అదితి కోసం వచ్చాడు అనుకుంటే... అదితిలా చూసి వెళ్ళిపోవచ్చు. కాని ఇలా ఇద్దరూ కలిసి వచ్చి మీడియాకి ఫోజులు ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. దాంతో మరోసారి వీరిద్దరు హాట్ టాపిక్ అవుతున్నారు. 

అసలు వీరి బంధం మొదలయ్యింది... మహా సముద్రం సినిమాతోనే..  అదితి, సిద్దార్థ్ కలిసి ఈ సినిమాలో నటించారు. అంతకుముందు నుంచే వీరికి పరిచయం ఉన్నా ఈ సినిమా తర్వాత క్లోజ్ అయ్యారు.  ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని  ఇండస్ట్రీలో టాక్ గట్టిగానడిచింది. మరి వీరి ప్రేమ రూమర్ వరకే ఆగిపోతుందా.. లేకు ఇద్దరు కలిసి కన్ ఫార్మ్ చేస్తారా..? పెళ్ళి వరకూ వెళ్తారా.. లేక లివింగ్ రిలేషన్ వరకే ఆపేస్తారా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌