స్టార్ హీరోకి లీగల్ నోటీసులు..!

Published : Nov 02, 2018, 11:04 AM IST
స్టార్ హీరోకి లీగల్ నోటీసులు..!

సారాంశం

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న ప్రకటనలు ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల అమితాబ్ తన కూతురితో కలిసి నటించిన ప్రకటన బ్యాంక్ ఉద్యోగులను కించే పరిచే విధంగా ఉందని లీగల్ ప్రొసీడ్ అవుతామని హెచ్చరించారు. 

తాజాగా ఆయన నటించిన ఎవరెస్ట్ మసాలా యాడ్ పై ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఈ యాడ్ లో అమితాబ్ లాయర్ కోట్ వినియోగించడంతో బార్ కౌన్సిల్ అమితాబ్ తో పాటు ఎవరెస్ట్ మసాలా నిర్వాహకులకు, యూట్యూబ్ ఛానెల్ కి, ఓ మీడియా సంస్థకి కూడా లీగల్ నోటీసులు పంపించారు.

పది రోజుల్లో ఈ విషయంపై వారు వివరణ ఇవ్వని పక్షంలో చట్టరీత్యా తీసుకునే చర్యలకి బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ యాడ్ ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. 
 
PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్