మేజర్ మూవీ ట్రైలర్ చూసి, టీమ్ ను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Published : May 06, 2022, 09:10 PM ISTUpdated : May 06, 2022, 09:15 PM IST
మేజర్ మూవీ ట్రైలర్ చూసి, టీమ్ ను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

సారాంశం

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా మేజర్. ఈమూవీకి దేశ రక్షణ మినిస్టర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ తో పాటు మూవీ టీమ్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు.   


అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సినిమా మేజర్. ఈమూవీకి దేశ రక్షణ మినిస్టర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ తో పాటు మూవీ టీమ్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. 

ఇండియా అంతటా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ మేజ‌ర్). 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్ని క్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో  టాలీవుడ్  హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించాడు. శ‌‌శి కిరణ్ టిక్కా డైరెక్ట్ చేసిన ఈసినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. 

ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న  ఈసినిమాతో పాటు అడివి శేష్ అండ్ డైరెక్ట‌ర్ శశికిరణ్  తిక్కా ..కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మేజ‌ర్‌ సినిమా ట్రైల‌ర్‌ను రాజ్‌నాథ్ వీక్షించారు. ఇండియా గ్రేట్ హీరో క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న డైరెక్ట‌ర్ శశిక‌ర‌ణ్, అడివి శేష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ రాజ్‌నాథ్ సింగ్ కుటుంబ‌స‌భ్యుల కోసం మేజ‌ర్ స్పెష‌ల్ స్క్రీనింగ్‌ వేయ‌నున్నారు. 

గూఢ‌చారి మూవీ త‌ర్వాత శోభితా ధూళిపాళ మ‌రోసారి అడివి శేష్‌కు జోడీగా న‌టిస్తోంది. స‌యీ మంజ్రేక‌ర్‌, ప్ర‌కాశ్ రాజ్‌, రేవ‌తి, అనీష్ కురువిల్లా, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈసినిమాను తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో 2022 జూన్ 3న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయబోతున్నారు. సోనీ పిక్చ‌ర్స్ ఇండియా, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మిస్తున్నాయి. స్టార్ హీరో మ‌హేశ్ బాబు మేజర్ సినిమాకు  వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా