
బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి తరువాత పర్ఫామెన్స్ ఓరియంటెండ్ సినిమాల వైపు మళ్లిన బ్యూటీ దీపికా పదుకొనే. అయితే కథల ఎంపికలో దీపికా పదుకొనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విషయాలను దీపికకు సంబంధించిన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
`దీపిక ప్రతిరోజు కొంత సమయాన్ని తన శకున్ బాత్రా స్క్రిప్ట్ చదివేందుకు కేటాయిస్తుంది. రోజూ కనీసం కొన్ని పేజీలైనా చదువుతుంది దీపిక. కానీ ఆమె తన పాత్ర కోసం ఎక్కువగా ప్రీపేర్ అవ్వదు. లాక్ డౌన్ తరువాత ప్రారంభం కానున్న ఈ సినిమాతో టచ్ మిస్ కాకూడదన్న ఉద్దేశంతోనే దీపిక రెగ్యులర్‌గా స్క్రిప్ట్‌ను స్టడి చేస్తుంది.
ఒక వేళ లాక్ డౌన్ వచ్చి ఉండకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతూ ఉండేంది. దీపిక గతంలో శకున్‌తో నెక్ట్స్ సినిమా చేయటంపై స్పందించింది. సినిమాల పట్ల శగున్‌కు ఉన్న ఆలోచనల దృష్ట్యా అతడితో నెక్ట్స్ సినిమా చేసేందుకు ఓకే చెప్పింది దీపిక.
ప్రస్తుతం దీపికకు మరిన్ని ఇంట్రస్టింగ్ సినిమాలను సెలెక్ట్ చేసుకునే అవకాశం దక్కింది. దీపిక పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అందుకే ఆమె చేసే పాత్రలను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. నైరా, వెరోనికా, పద్మావతి, లీలా ఇలా ఎన్నో పాత్రలకు తన అద్భుతమైన నటనతో ప్రాణం పోసింది దీపిక. తిరిగి షూటింగ్ లో పాల్గోనేందుకు దీపిక ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. అభిమానులు కూడా ఆమెను తెర మీద చూసేందుకు అంతే ఎదురుచూస్తున్నారు.