పోలీసుల మీద సినిమాలు తీసినందుకు సిగ్గు పడుతున్నా.. `సింగం` డైరెక్టర్

Published : Jun 29, 2020, 05:35 PM ISTUpdated : Jun 29, 2020, 05:47 PM IST
పోలీసుల మీద సినిమాలు తీసినందుకు సిగ్గు పడుతున్నా.. `సింగం` డైరెక్టర్

సారాంశం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం జయరాజ్‌, బెనిక్స్‌ల మృతి. తమిళనాడు లాక్‌ డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచారని తండ్రి కొడుకులైన జయరాజ్‌, బెనిక్స్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని చిత్ర హింసలకు గురిచేసి చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్‌ లో వరుసగా పోలీసు కథలతో సినిమాలు తెరకెక్కించి ఘన విజయాలు అందుకున్న దర్శకుడు హరి. సౌత్‌లో బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌ సింగం సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు హరి. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌ అందించిన దర్శకుడు కూడా హరినే కావటం విశేషం. అయితే తాజాగా ఈ దర్శకుడు పోలీసులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను పోలీస్‌ కథలతో 5 సినిమాలు తెరకెక్కించినందుకుగానూ సిగ్గుపడుతున్నానని చెప్పాడు హరి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం జయరాజ్‌, బెనిక్స్‌ల మృతి. తమిళనాడు లాక్‌ డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచారని తండ్రి కొడుకులైన జయరాజ్‌, బెనిక్స్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని చిత్ర హింసలకు గురిచేసి చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా ఈ సంఘటనపై తీవ్ర స్వరంతో స్పందిస్తున్నారు.

ఇదే విసయంపై స్పందించిన డైరెక్టర్‌ హరి, ఇలాంటి పనులు చేస్తున్న పోలీసులను హీరోలుగా చూపిస్తూ 5 సినిమాలు తీసినందుకు సిగ్గుపడుతున్నా అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటి హత్యలు మరోసారి జరగకూడదని కొంత మంది పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశాడు హరి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌