దీపికా ఫ్యామిలీకి కరోనా.. ఆసుపత్రిలో తండ్రి ప్రకాష్‌ పదుకొనెకి చికిత్స

Published : May 04, 2021, 05:04 PM ISTUpdated : May 04, 2021, 05:06 PM IST
దీపికా ఫ్యామిలీకి కరోనా.. ఆసుపత్రిలో తండ్రి ప్రకాష్‌ పదుకొనెకి చికిత్స

సారాంశం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరెంట్స్ కి కరోనా సోకింది. దీపికా తండ్రి, లెజెండరీ బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాష్‌ పదుకొనె(65)కి, దీపికా తల్లి ఉజ్జాల, దీపికా సోదరి అనిషాలకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరెంట్స్ కి కరోనా సోకింది. దీపికా తండ్రి, లెజెండరీ బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాష్‌ పదుకొనె(65)కి, దీపికా తల్లి ఉజ్జాల, దీపికా సోదరి అనిషాలకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. వారి ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రకాష్‌ పదుకొనె ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ని బెంగూళూరులోని ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, క్రమంగా కోలుకుంటున్నట్టు వారి సన్నిహితులు తెలిపారు. ప్రకాష్‌ పదుకొనె భార్య ఉజ్జాల, కూతురు అనిషాలకు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని, ప్రకాష్‌ కి జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తార`ని ప్రకాష్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ విమల్‌ కుమార్‌ తెలిపారు.

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ని వివాహం చేసుకుని ముంబయిలో సెటిల్‌ అయిన దీపికా పదుకొనె ప్రస్తుతం `83`, `పఠాన్‌`, శకున్‌ బట్రా చిత్రాల్లో నటిస్తుంది.  ప్రకాష్‌ పదుకొనె లెజెండరీ బాడ్మింటన్‌ ప్లేయర్‌ అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఇండియాకి అనేక కప్‌లు తీసుకొచ్చారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..