పవన్ కుమార్తె..ఫస్ట్ టైమ్ టీవి షోలో

Surya Prakash   | Asianet News
Published : May 04, 2021, 03:39 PM ISTUpdated : May 04, 2021, 04:06 PM IST
పవన్ కుమార్తె..ఫస్ట్ టైమ్ టీవి షోలో

సారాంశం

ఊహించని విధంగా ఆద్య ..కెమెరా ముందుకు వచ్చింది.  ఓ టీవి షో నిమిత్తం ఆమె మొదటి సారిగా కెమెరాని ఫేస్ చేసారు. ఆమె జీ తెలుగులో వస్తున్న  డ్రామా జూనియర్స్ టీవి షో లో  స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్యలను పబ్లిక్ లో పెద్దగా కనపడరు. తన తల్లి రేణు దేశాయ్ తో ఉంటున్న వాళ్లు తన చదువు, తమ ఆట,పాటలు లోకం అన్నట్లుగా ఉంటారు. అంతేకానీ పబ్లిక్ ఎప్పీరియన్స్ ని పెద్దగా కోరుకోరు. అప్పుడప్పుడూ అభిమానుల కోరిక మేరకు రేణు దేశాయ్ వారి ఫొటోలను షేర్ చేస్తూంటుంది సోషల్ మీడియాలో. అయితే ఊహించని విధంగా ఆద్య ..కెమెరా ముందుకు వచ్చింది. 

ఓ టీవి షో నిమిత్తం ఆమె మొదటి సారిగా కెమెరాని ఫేస్ చేసారు. ఆమె జీ తెలుగులో వస్తున్న  డ్రామా జూనియర్స్ టీవి షో లో  స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. రేణు దేశాయ్ ఆ షో జడ్జిలలో ఒకరు. ఈ మేరకు ఓ ప్రోమో కట్ చేసి వదిలారు. రేణు తన కుమార్తె ని షోలో చూసి సర్పైజ్ అవుతున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. మే 9 రాత్రి ఎనిమిది గంటలకు ఆ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

ఇక  పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు విడాకులు తీసుకున్న తర్వాత రేణు ఆద్య, అకిరా లతో పుణేలో ఉంటుంది. ఐతే పవన్ కళ్యాణ్ తండ్రిగా ఎప్పుడు తన భాద్యతలను నెరవేరుస్తూనే ఉన్నాడు. సమయం దొరికినప్పుడు.. ఏవైనా స్పెషల్ అకేషన్స్ లో తన పిల్లలతో గడుపుతాడు. ఇక మెగా ఫ్యామిలీ తో కూడా ఆద్య, అకిరాల బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమయ్యింది.

ఈ మధ్యనే  నిహారిక పెళ్ళిలో పవన్ కళ్యాణ్ తన పిల్లలతో కలిసి హాజరయ్యాడు. వివాహంలో ఆధ్య, అకిరా తండ్రి పవన్‌తో కలిసి సందడి చేశారు. పెళ్లిలో మెగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. తాజాగా ఆద్య కొణిదెల ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తన తల్లి రేణు దేశాయ్ ఇన్‌స్టగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడీ షో వీడియో వైరల్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

PREV
click me!

Recommended Stories

Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్