భర్త సినిమా ట్రైలర్ చూసి ఏడ్చేసిందట!

Published : Aug 27, 2018, 03:24 PM ISTUpdated : Sep 09, 2018, 01:16 PM IST
భర్త సినిమా ట్రైలర్ చూసి ఏడ్చేసిందట!

సారాంశం

తెలుగులో 'అమ్మాయిలు అబ్బాయిలు' చిత్రంతో నటించిన హీరోయిన్ డెబీనా బెనర్జీ ఆ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు

తెలుగులో 'అమ్మాయిలు అబ్బాయిలు' చిత్రంతో నటించిన హీరోయిన్ డెబీనా బెనర్జీ ఆ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరోయిన్ సినిమాల్లో ఎక్కువగా రాణించలేకపోయింది. ప్రస్తుతం టీవీ షోలతోనే గడుపుతోంది. ఆమె భర్త గుర్మీత్ చౌదరి నటుడిగా కెరీర్ సాగిస్తున్నాడు.

ప్రస్తుతం ఆయన నటించిన 'పల్టన్' అనే సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అయితే ఈ ట్రైలర్ చూసిన అతడి భార్య డెబీనా ఏడ్చేసిందట.

ఈ విషయాన్ని గుర్మీత్ స్వయంగా చెప్పుకొచ్చాడు. డెబీనాకి ఫోన్ చేసి ట్రైలర్ ఎలా ఉందని గుర్మీత్ అడగగా ఆమె.. 'గురూ.. నేను ట్రైలర్ చూశాను. నాకు ఏడుపొస్తుంది' అని చెప్పిందట. డెబీనా పెద్ద క్రిటిక్ అని తన పని విషయంలో ఏం చిన్న తప్పు చేసినా వెంటనే చెప్పేస్తుంటుందని గుర్మీత్ చెప్పుకొచ్చాడు.  
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..