టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే..?

First Published Feb 15, 2019, 2:10 PM IST

 టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే..?

స్నేహితులు లేనివారి ఎవరూ ఉండరని అంటుంటారు. అది నిజమే.. మన జీవితాల్లో స్నేహం అనేది అంత ముఖ్యపాత్ర పోషిస్తుంటుంది. టాలీవుడ్ లో కూడా కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.. వారెవరో ఇప్పుడు చూద్దాం!
undefined
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు మాత్రమే కాదు.. బిజినెస్ పార్ట్నర్స్ కూడా.. గతంలో ఇద్దరూ కలిసి కొన్ని వ్యాపారాలు చేశారు. ఇద్దరూ కలిసి కథలను కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారిపిల్లలు రామ్ చరణ్, అఖిల్ లు కూడా ఎంతో ప్రేమగా మెలుగుతుంటారు.
undefined
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆలోచన విధానం ఒకటేనని ఆ కారణంగానే ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని చెబుతుంటారు. ఇక సిల్వర్ స్క్రీన్ మీద వారి కాంబినేషన్ బ్లాక్స్ బస్టర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
undefined
రామ్ చరణ్, రానా ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ కి వెళ్లేవారు. తొమ్మిదో తరగతి వరకు చెన్నైలో కలిసి చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఒకరి గురించి ఒకరు ఫన్నీ విషయాలను షేర్ చేసుకుంటూనే ఉంటారు.
undefined
ప్రభాస్, గోపీచంద్ చాలా కాలంగా మంచి స్నేహితులు. గోపీచంద్ సినిమా ఈవెంట్లకు అతిథిగా వెళ్తుంటాడు ప్రభాస్. ఈ ఇద్దరూ కలిసి 'వర్షం' సినిమాలో నటించారు.
undefined
మాస్ మహారాజ రవితేజ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి సినిమాలు చేయడమే కాదూ.. కలిసి ట్రిప్ లకు కూడా వెళ్తుంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ఇడియట్' సినిమా రవితేజ కెరీర్ కి పెద్ద బ్రేక్.
undefined
నిజ జీవితంలో ఎన్టీఆర్ కి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజీవ్ కనకాల కష్టసుఖాలను పంచుకోవడంతో పాటు అన్ని విషయాల్లో ఒకరి సలహాలను మరొకరు పాటిస్తుంటారు.
undefined
నితిన్, అఖిల్ కలిసి సిసిఎల్ టూర్ లో కలిసినప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగానే అఖిల్ మొదటి సినిమాను నితిన్ నిర్మించాడు. కానీ ఈ సినిమా వర్కవుట్ కాలేదు.
undefined
రామ్ చరణ్, శర్వానంద్ చిన్నప్పటి స్నేహితులు. సందర్భం వచ్చినప్పుడల్లా శర్వానంద్.. చరణ్ ని పొగుడుతూనే ఉంటారు. చరణ్ కి మరదలి వరసయ్యే అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకుంటాడనే రూమర్ అప్పట్లో బాగా వినిపించేది.
undefined
సమంత, ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోనేరు మంచి స్నేహితులు. సమంత కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఆమెకి డిజైనర్ గా నీరజనే పని చేస్తున్నారు. సమంతకి సంబంధించిన ప్రతి ఈవెంట్ లో నీరజ కోనేరు ఉండాల్సిందే!
undefined
శ్రుతిహాసన్, తమన్నా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల శ్రుతిహాసన్ పుట్టినరోజు వేడుకలను కూడా మిస్ చేయలేదు తమన్నా.
undefined
click me!