విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' కొత్త పోస్టర్!

By Udaya DFirst Published Mar 8, 2019, 10:42 AM IST
Highlights

విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు.

విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. 'గీత గోవిందం' సినిమాలో విజయ్ తో కలిసి నటించిన రష్మిక మందన్నా ఈ సినిమాలో కూడా విజయ్ కి జోడీ కట్టింది. 

భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

మార్చి 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్రబృందం.  ఈ పోస్టర్ లో స్పోర్ట్స్ డ్రెస్ లో ఉన్న రష్మిక.. విజయ్ ని గట్టిగా హత్తుకొని కనిపించింది.

కాకినాడ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. కథ ప్రకారం విజయ్ కాకినాడ యాసలో అలరించబోతున్నాడు.

Telugu
Tamil
Malayalam
Kannada Comrades -

are we ready?
The 17th of March. pic.twitter.com/dEllWg6ecp

— Vijay Deverakonda (@TheDeverakonda)
click me!