
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఈ సినిమానుండి వీడియో సాంగ్స్, ట్రైలర్ ని విడుదల చేసి రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించాడు వర్మ.
తాజాగా సినిమా నుండి మరో ట్రైలర్ ని శుక్రవారం నాడు విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజుల్లోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ ని వంచించి ఎలా ముఖ్యమంత్రి ఎక్కారనే సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చూపించారు.
లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నీచంగా చూసే సన్నివేశాలు ట్రైలర్ లో ఉన్నాయి.జీవీ ఫిలిమ్స్ బ్యానర్ పై రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.