'డియర్‌ కామ్రేడ్‌' హిందీ రీమేక్‌ ఖరారు.. హీరో ఎవరంటే..?

Published : Jul 24, 2019, 12:57 PM IST
'డియర్‌ కామ్రేడ్‌' హిందీ రీమేక్‌ ఖరారు.. హీరో ఎవరంటే..?

సారాంశం

‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌ హక్కుల్ని కరణ్‌ సొంతం చేసుకోవటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కరణ్ ఏ హీరోతో ఈ సినిమా చేయబోతున్నారనే చర్చ మొదలైంది. 

బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. యంగ్ హీరో  విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. జులై 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపధ్యంలో  ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌ హక్కుల్ని కరణ్‌ సొంతం చేసుకోవటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. ఈ రీమేక్ ని కరణ్ ఏ హీరోతో చేయబోతున్నారు అని. రీసెంట్ గా షాహిద్ కపూర్ తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఘన విజయం సాధించటంతో...ఈ సినిమా రీమేక్ సైతం షాహిద్ తో చేసే అవకాసం ఉందంటూ వార్తలు  మొదలయ్యాయి.

అయితే కరణ్ మనస్సులో వేరే హీరో ఉన్నారని చెప్తున్నారు. ఏదైమైనా సినిమా రిలీజ్ తర్వాత ఓ క్లారిటీ రానుంది. హిందీ వెర్షన్ కు కొద్ది పాటి మార్పులు అవసరమవుతాయంటున్నారు. కరణ్ జోహార్ సినిమాను చూసి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అద్భుతమైన, పవర్‌ఫుల్‌ ప్రేమకథ. భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ చక్కటి సంగీతం అందించారు. నటీనటుల నటన అత్యుత్తమంగా ఉంది. విజయ్‌ దేవరకొండ బ్రిలియంట్‌, రష్మిక బాగా నటించారు. ఈ అందమైన ప్రేమకథను ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ రీమేక్‌ చేయబోతోందని ప్రకటిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం