నాని 'గ్యాంగ్ లీడర్' టీజర్.. ఫన్ కి కేరాఫ్ అడ్రెస్!

By AN TeluguFirst Published Jul 24, 2019, 11:38 AM IST
Highlights

నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. తాజాగా సినిమా కొత్త టీజర్ ని విడుదల చేశారు. 'నా గ్యాంగ్, విక్రమ్ కథ, అనిరుధ్‌ సౌండ్‌, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్‌టైన్‌మెంట్‌' అని క్యాప్షన్ ఇచ్చారు. 

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని, ఒక టీజర్ ని విడుదల చేశారు. తాజాగా సినిమా కొత్త టీజర్ ని విడుదల చేశారు.

'నా గ్యాంగ్, విక్రమ్ కథ, అనిరుధ్‌ సౌండ్‌, మైత్రి డబ్బు, మన సినిమా, మీ ఎంటర్‌టైన్‌మెంట్‌' అని క్యాప్షన్ ఇచ్చారు. ముందుగా నాని 'నా పేరు పెన్సిల్.. ఫేమస్ 
రివెంజ్ రైటర్' అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

టీజర్ ని బట్టి చూస్తుంటే.. ఒంటరిగా ఉంటున్న నాని వద్దకు ఓ చిన్నారితో కలిసి నలుగురు ఆడవాళ్లు వస్తారు. వారంతా నాని సహాయంతో తమ పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

టీజర్ చివర్లో వచ్చిన కళ్లజోడు డైలాగ్స్ ఆడియన్స్ ని నవ్విస్తుంది. విక్రమ్ టేకింగ్ చూస్తుంటే సినిమాను కామెడీ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్చేస్తున్నారు.  

 

click me!