Dear Astronaut: అమ్మ జ్ఞాపకం.. అంతరిక్షంలోకి వెళ్లాలనే కల.. ఆకట్టుకుంటున్న 'డియర్ ఆస్ట్రోనాట్' ట్రైలర్

Published : Nov 15, 2026, 12:20 PM IST
Dear Astronaut

సారాంశం

Dear Astronaut: డిఫరెంట్ కథలతో తెరకెక్కుతున్న చిన్ని సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం తెలిసిందే. ఆ కోవలోనే మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతరిక్షంలోకి వెళ్లాలనే కలతో అమ్మాయి చేసిన సాహసమే ఈమూవీ.

రిలీజ్ కు రెడీ అవుతున్న డియర్ ఆస్ట్రోనాట్

విభిన్న కథలను ఆదరించే ప్రేక్షకుల కోసం మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌమిత్ రావు, శ్రేయసి సేన్ జంటగా నటించిన 'డియర్ ఆస్ట్రోనాట్' (Dear Astronaut) చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను పొందుతోంది. కార్తీక్ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మనస్విని భాగ్యరాజ్ సమర్పిస్తున్నారు.

డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్ రివ్యూ..

కథా నేపథ్యం చూస్తే, కల్పనా చావ్లా స్ఫూర్తితో అంతరిక్షంలోకి వెళ్లాలని చిన్నప్పటి నుంచి కలలు కనే ఒక యువతి ప్రయాణం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. తన అమ్మ ఆకాశంలోకి వెళ్లిపోయిందని భావించే ఆ అమ్మాయి, ఎలాగైనా అంతరిక్షంలోకి వెళ్లి తన అమ్మను కలుసుకోవాలనే తపనతో ముందుకు సాగుతుంది. పెళ్లి తర్వాత కూడా తన లక్ష్యాన్ని వదులుకోకుండా ప్రయత్నించే ఆమెకు భర్త మద్దతు ఏ విధంగా నిలిచింది, ఎదురైన సవాళ్లను ఆమె ఎలా అధిగమించింది అనే అంశాలను చాలా ఎమోషనల్ గా చూపించినట్లు ట్రైలర్ లో స్పష్టం అవుతోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించగా, తాజా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రంలో సౌమిత్ రావు, శ్రేయసి సేన్‌లతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, లక్ష్యసాధన కలబోసిన ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

First OTT Platform: ఇండియాలో మొదటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదో తెలుసా?
Kajal Aggarwal: 100 అడుగుల క్రేన్ మీద పడుతుంటే ఒక చెయ్యి నన్ను లాగింది, కాజల్ అగర్వాల్ షాకింగ్ స్టోరీ