దాసరి కొడుకు కోసం చిత్తూరు పోలీసుల అన్వేషణ!

Published : Jun 14, 2019, 09:40 AM IST
దాసరి కొడుకు కోసం చిత్తూరు పోలీసుల అన్వేషణ!

సారాంశం

దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇందులో భాగంగా వారికి కొన్ని వివరాలు లభించాయి. ఈ నెల 5న రాత్రి చెన్నై నుండి హైదరాబాద్ కి వచ్చిన తారక ప్రభు ఈ నెల 7వ తేదీ వరకు కూకట్ పల్లిలో తన పెద్ద అల్లుడు ఇంట్లో ఉన్నాడని, 8వ తేదీ పని ఉందని జూబ్లీహిల్ద్ రోడ్ నెంబర్ 46లో తన ఆఫీస్ కి వెళ్లి ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే పడుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకు ఇంట్లోనే ఆఫీస్ పనులు చూసుకున్న ప్రభు ఇంటి వద్ద ఆటో ఎక్కి బయటకి వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం అతడి భార్య పద్మావతి.. ప్రభుకి ఫోన్ చేయగా, ఫోన్ రింగ్ అయినా కాల్ కట్ అవుతుందన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు.

అతడి ఆచూకి తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రభు చిత్తూరు బస్ ఎక్కినట్లు 
గుర్తించారు. దీంతో చిత్తూరు పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కూడా గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా