"అమ్మ" పై దాసరి సినిమా

Published : Jan 03, 2017, 12:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
"అమ్మ" పై దాసరి సినిమా

సారాంశం

జయలలిత జీవితంపై సినిమా తెరకెక్కించనున్న దర్శకరత్న దాసరి ఫిల్మ్ ఛాంబర్ లో "అమ్మ" పేరుతో సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించిన దాసరి

తమిళనాడు దివంగత సీఎం, నాటి అందాల తార జయలలిత జీవితంపై సినిమా తీసేందుకు చాలా మంది దర్శకులు ఆసక్తితో సినిమా చేస్తున్నట్లు ప్రకటనలు చేసేశారు. అయితే సీనియర్ దర్శకులు, దర్శకరత్న దాసరి కూడా జయలలిత జీవితంపై సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారట. తమిళనాట ఎందరికో అమ్మ గా మారిన జయలలితతో తనకు అనుబంధముందని, ఆమె గురించి తెలిసిన విషయాలపై సినిమా తీస్తే బావుంటుందని దాసరి అభిప్రాయపడుతున్నారు.

 

అందుకే టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని ప్రకటించిన దాసరి, తరువాత ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. దాసరి అనారోగ్య సమస్యలతో పాటు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన వడ్డీకాసులవాడు సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు ప్రాజెక్ట్‑లను పక్కకు పెట్టేసిన దాసరి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు.


తాజాగా అమ్మ అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాసరి స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Actor Ravi Mohan: డైరెక్టర్ కాకముందే విలన్‌గా రవి మోహన్.. షాకింగ్ రెమ్యూనరేషన్