
రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) అంటూ వివాదం, సంచలనం రెండే ప్రధానంగా గుర్తొస్తాయి. అవే మన కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఆయన ఎక్కడికైనా వెళ్లారంటే అదో సంచలనమో, లేక వివాదమో కావాల్సిందే. బోల్డ్ కామెంట్ వైరల్ అవుతుంటాయి. హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. సినిమా ప్రోగ్రామ్‌లలో హీరోయిన్లపై, టీవీ ఇంటర్వ్యూలో యాంకర్లపై RGV సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తుంటారు. ట్రెండింగ్‌గా మారుతుంటారు. తాజాగా యాంకర్ శ్యామలపై ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
`పుష్ప` చిత్రంలో జాలిరెడ్డిగా నటించి ఆకట్టుకున్న కన్నడ నటుడు ధనుంజయ్ కన్నడలో నటించిన చిత్రాన్ని తెలుగులో `బడవ రాస్కెల్` పేరుతో డబ్ చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే విడుదలైన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల(ఫిబ్రవరి) 18న ఇది తెలుగు తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి గెస్ట్ గా రామ్‌గోపాల్ వర్మ హాజరయ్యారు.
వర్మ స్టేజ్‌పైకి రావడానికి ముందే యాంకర్ శ్యామల.. ఆయనపై పలు సెటైర్లు వేసింది. నవ్వులు పూయించింది. ఇక చివర్లో ఆర్జీవీని స్టేజ్‌పైకి పిలవగా, వచ్చిన వర్మ.. మాట్లాడుతూ ముందుగా యాంకర్ శ్యామల గురించి మాట్లాడారు. ఆమెపై బోల్డ్ కామెంట్ చేశారు. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా అరుపులతో రచ్చ చేయగా, శ్యామల ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేసింది. స్మైల్‌తో వర్మకి ధన్యవాదాలు చెప్పుకుంది. అయితే ఇప్పుడు ఈ వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వర్మ ఇంకా చెబుతూ తను రాస్కెల్ అని చెప్పుకున్నారు. తనని యాంకర్ శ్యామల తోపు, రౌడీ, గుండా ఇలా అన్ని పేర్లతో పిలిచారని, కానీ తాను రాస్కెల్ అని చెప్పడం ఆకట్టుకుంది. అయితే తనకు బడవ అనే పదానికి సరైన అర్థం తెలియదన్నారు. తనని పొగిడిన నిర్మాతని ఉద్దేశించి చెబుతూ, పోయాక మాట్లాడే పొగడ్తలని తనపైన తనే సెటైర్లు వేసుకున్నారు వర్మ. ఇక వర్మ ప్రస్తుతం `కొండా` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజకీయ నాయకులు కొండా సురేఖ, కొండా మురళీ జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మురళీ పాత్ర కోణంలో ఇది సాగబోతుంది. ఇందులో అరుణ్ ఆదిత్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.