
కీర్తి సురేష్ బర్త్ డే నేడు. 1992 అక్టోబర్ 17న జన్మించిన కీర్తి నేడు 30వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ దసరా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెళ్లి కూతురు గెటప్ లో కీర్తి లుక్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ పేరు వెన్నెల అని రివీల్ చేశారు. నాని కోల్ మైన్ వర్కర్ గా ఊరమాస్ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. ఆయన లవ్ ఇంట్రెస్ట్ కీర్తి సురేష్ సైతం డీగ్లామర్ రోల్ చేస్తుందని ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చేసింది.
దసరా మూవీపై అంచనాలు కీర్తి ఫస్ట్ లుక్ తర్వాత మరో స్థాయికి చేరాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పాన్ ఇండియన్ మూవీగా దసరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మూవీ విడుదల కానుంది. సముద్ర ఖని, సాయి కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఇటీవల మూవీ నుండి ''ధూమ్ ధామ్ దోస్తాన్'' సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది.
దసరా చిత్రంతో పాటు కీర్తి భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు. అలాగే మరో రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఒక ప్రక్క స్టార్ లేడీగా కొనసాగుతున్న కీర్తి చెల్లెలు పాత్రలు చేయడం విశేషం. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటించిహ్న సర్కారు వారి పాట మంచి విజయం సాధించింది.