
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.
దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య కూడా హాజరయ్యారు. భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడిన తర్వాత మొగిలయ్యకు కిన్నెర కళకు విశేషమైన గుర్తింపు లభించింది. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన కళని గుర్తించడం, పద్మశ్రీ అవార్డుకు గాను కేంద్రానికి మొగిలయ్య పేరు ప్రతిపాదించడం జరిగింది. దీనితో కేంద్ర ప్రభుత్వం మొగిలయ్యని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
దీనితో మొగిలయ్య క్రేజీ సెలబ్రిటిగా మారిపోయారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ సంతోషంతో మురిసిపోయాడు. పవన్ సార్ సినిమాలో పాట పాడిన తర్వాత గొప్ప పేరు వచ్చింది. ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలే అంటూ మొగిలయ్య సంబరపడిపోయారు. ఢిల్లీలో నాకు అవార్డు వచ్చింది. దీనితో మన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ ఇంటి స్థలం, రూ. కోటి డబ్బు సాయం చేశారు.
పవన్ కళ్యాణ్ సర్ కూడా నన్ను పిలిచి సన్మానం చేశారు. ఆర్థిక సాయం చేశారు. ఈ సినిమాలో పాట పడితే ఇంత పెద్దగా అవుతుందని ఊహించలేదు అంటూ మొగిలయ్య సంబరపడ్డారు. అనంతరం ఫ్యాన్స్ కోరికమేరకు తన కిన్నెరతో వేదికపై భీమ్లా నాయక్ సాంగ్ పాడారు. దీనితో అభిమానుల కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు.