మెగాస్టార్ హార్డ్ కొర్ ఫ్యాన్.. సైరా టికెట్స్ ఫ్రీ

Published : Sep 25, 2019, 11:17 AM ISTUpdated : Sep 25, 2019, 11:20 AM IST
మెగాస్టార్ హార్డ్ కొర్ ఫ్యాన్.. సైరా టికెట్స్ ఫ్రీ

సారాంశం

టాలీవుడ్  బిగ్గెస్ట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. 280కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాల డోస్ ఆకాశానికి చేరుకుంది.

టాలీవుడ్  బిగ్గెస్ట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. 280కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాల డోస్ ఆకాశానికి చేరుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని అర్ధమవుతోంది. 

ఇక యూఎస్ లో ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్టోబర్ 1న సైరా ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమాను యూఎస్ లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే మెగాస్టార్ వీరాభిమాన  ఒకరు ప్రత్యేకంగా డల్లాస్ లో ఉన్న మెగా అభిమానుల కోసం ఒక ప్రీమియర్ షో టికెట్లను ఫ్రీగా అందించనున్నారు. 

అతని పేరు ఫణి ముత్యాల. మెగాస్టార్ కి హార్డ్ కొర్ ఫ్యాన్ అయిన ఫణి ఒక షో మొత్తం మెగా అభిమానులకు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, మెగాస్టార్ అంటే అతనికి ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఖైదీ నెంబర్ 150 ప్రీమియర్స్ తో ఈజీగా $1 మిలియన్ మార్క్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు సైరా తో అంతకంటే స్పీడ్ గా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్