యాక్సిడెంట్‌ వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ

Published : Aug 13, 2020, 03:44 PM ISTUpdated : Aug 13, 2020, 04:04 PM IST
యాక్సిడెంట్‌ వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ

సారాంశం

ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్రచారాన్ని అభిరామ్‌ కుటుంబ‌స‌భ్యులు కొట్టి పారేశారు. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

గురువారం ఉదయం దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, హీరో రానా తమ్ముడు అభిరామ్‌ కారు ప్రమాధానికి గురైనట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అభిరామ్ ప్రయాణిస్తున్న కారు మణికొండ పంచవటి కాలనీలో మరో కారును ఢీకొన్నట్టుగా వార్తలు వచ్చాయి. ప్రమాదంలో ఎవరూ గాయపడకపోయినా దగ్గుబాటి ఫ్యామిలీ కారు ప్రమాదానికి గురైందని తెలియటంతో ఆ వార్త వైరల్‌ అయ్యింది.

అయితే ఈ వార్తలను దగ్గుబాటి ఫ్యామిలీ ఖండించింది. ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్రచారాన్ని అభిరామ్‌ కుటుంబ‌స‌భ్యులు కొట్టి పారేశారు. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

అయితే తరువాత జబర్థస్త్ షోలో పాల్గొనే అదిరే అభి కారు కూడా ప్రమాదానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా అభి ఖండించారు. తన కారు ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి కన్ఫర్మెషన్‌ లేకుండా వార్తలు రాయవద్దని ఆయన మీడియాను కోరారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?