క్రేజీ అప్డేట్... సంక్రాంతి బరిలో అజిత్ వలిమై

By team teluguFirst Published Sep 22, 2021, 2:32 PM IST
Highlights

2022 సంక్రాంతి కానుకగా వలిమై(Valimai) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. వలిమై నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్ వేదికగా వలిమై 2022 పొంగల్ బరిలో దిగుతున్నట్లు స్పష్టత ఇచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా అజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వలిమై మూవీ విడుదల తేదీపై అప్డేట్ రావడంతో వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 2022 సంక్రాంతి కానుకగా వలిమై(Valimai) విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. వలిమై నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్ వేదికగా వలిమై 2022 పొంగల్ బరిలో దిగుతున్నట్లు స్పష్టత ఇచ్చాడు. 

ఇక ఈ క్రేజీ అప్డేట్ ని ఫ్యాన్స్ భారీగా ట్రెండ్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా వలిమై ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వలిమై తెరకెక్కుతుండగా, అజిత్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు హెచ్ వినోత్ వలిమై చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 


బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. క్రేజీ విలన్ గా అజిత్ తో తలపడనున్న కార్తికేయ క్యారెక్టర్ పై ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు విజయ్ బీస్ట్ సైతం పొంగల్ కానుకగా విడుదల కానుండగా, ఇద్దరు టాప్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద, పోటీ పడుతున్నారు. 

Happy to announce that will hit the screens on Pongal 2022.

— Boney Kapoor (@BoneyKapoor)
click me!