తమిళ నేచురల్ స్టార్ శివకార్తికేయన్ క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు యంగ్ హీరో. వివరాలేంటంటే..?
టాలీవుడ్ లో నాని ఎలాగో.. తమిళంలో శివకార్తికేయన్ అలాగ. అక్కడ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. మంచి మంచి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. అంతే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు శివ. ఇక ఆయయన సినిమాలన్నీతెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన మహావీర సినిమాకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదికూడా స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ తో.
తమిళంలో స్టార్ డైరెక్టర్ గా మురుగుదాస్ టాలెంట్ అందరికి తెలిసిందే. తమిళంలోనే కాదు.. ఆయన తెలుగులో కూడా డైరెక్ట్ సినిమాలు చేశాడు. తన కెరియర్‌లో గజిని, తుపాకీ, కత్తి, స్టాలిన్ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించాడు మురుగుదాస్. ఈ సినిమాలన్నీ..కోలీవుడ్ తో పాటు.. తెలుగులో కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక తెలుగులో డైరెక్ట్ గా.. చిరంజీవితో స్టాలిన్.. మహేష్ బాబుతో స్పైడర్ మూవీని తెరకెక్కించారు. హిందీలో కూడా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో గజిన్ రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే నేడు మురుగుదాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు.
నిన్న (25 సెప్టెంబర్ ) మురుగుదాస్ పుట్టినరోజు సందర్భంగా మురుగదాస్ ను కలుసుకున్న కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఆయనకు విషెస్ తెలిపాడు. అనంతరం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ SK 23 మురుగదాస్‌తో ఉంటుదని అనౌన్స్ చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ”డియర్ మురుగదాస్ సర్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా 23వ ప్రాజెక్ట్ కోసం మీతో కలిసి వర్క్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు చెప్పిన కథ విన్నాక నా ఆనందం రెట్టింపు అయ్యింది. అన్ని విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకం కానుంది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ శివ కార్తికేయన్ ట్వీట్ చేశారు.
Dear sir,
Wishing you a very happy birthday sir 😊👍
Sir I’m extremely delighted to join with you for my 23rd film and I'm double delighted after listening to your narration. This film is going to be very special for me in all aspects and I can’t wait to start… pic.twitter.com/XiOye1GmuL
ఇక ఈ న్యూస్ తో శివకార్తికేయన్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అటు రజనీకాంత్ దర్బార్ సినిమా డిజాస్టర్‌తో సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు మురుగదాస్ మళ్లీ మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ సినిమాను లైట్ హౌస్ మూవీస్ సంస్థ మంచి బడ్జెట్ తో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. శివకార్తికేయన్ తో పాటు. మురుగుదాస్ ఇమేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకుని.. ఈ సినిమాను తమిళంతో పాటు , తెలుగు, హిందీ భాషల్లో కూడా రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిఈ సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో మూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.