ప్రాజెక్ట్ కే మూవీపై రోజుకో ఊహాగానం. ఈ చిత్ర కథపై అనేక రూమర్స్ ఉన్నాయి. తాజా కథనం ప్రకారం ప్రభాస్ మోడ్రన్ శ్రీకృష్ణుడిగా కనిపిస్తారట.
ప్రాజెక్ట్ కే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2024 సంక్రాంతి టార్గెట్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కే టైటిల్ త్వరలో ప్రకటిస్తారట. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుండగా... కథపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఇది టైం ట్రావెల్ మూవీ అంటున్నారు. హీరో , విలన్ మధ్య సంఘర్షణ నేపథ్యంలో కాలాల్లో ప్రయాణం చేస్తారట. ఈ క్రమంలో భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించిన సీన్స్ ఉంటాయట.
అలాగే ప్రాజెక్ కే అనగా ప్రాజెక్ట్ కృష్ణ అని అర్థం. ఈ మూవీలో ప్రభాస్ మోడ్రన్ కృష్ణుడిగా కనిపిస్తాడన్న వాదన మొదలైంది. మహాభారతంలో కృష్ణుడు పాత్ర కీలకం. కృష్ణుడు క్యారెక్టరైజేషన్ మిగతా పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఒక వేళ నాగ్ అశ్విన్ ప్రభాస్ ని మోడ్రెన్ శ్రీకృష్ణుడుగా చూపిస్తే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ న్యూస్ ఒకింత ఫ్యాన్స్ భయపెడుతుంది.
ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ మోడ్రన్ రాముడిగా నటించి విమర్శల పాలయ్యారు. రామాయణం కథను కొత్తగా చెప్పాలని ప్రయత్నం చేసి దర్శకుడు ఓం రౌత్ విమర్శలు ఎదుర్కొన్నారు. దేవుడు సెంటిమెంట్స్ ని టచ్ చేసి ఆదిపురుష్ టీమ్ వ్యతిరేకతకు గురైంది. ప్రాజెక్ట్ కే లో కూడా శ్రీకృష్ణుడు ప్రస్తావన, మోడ్రన్ శ్రీకృష్ణుడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతుండగా ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
అయితే ఆదిపురుష్ రామాయణగాథ కాబట్టి నమ్మకాలకు భిన్నంగా రూపొందించడం వలన సమస్యలొచ్చాయి. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. శ్రీకృష్ణుడు ప్రస్తావన మాత్రమే ఉంటుంది. ప్రభాస్ నేరుగా శ్రీకృష్ణుడు పాత్ర చేయడం లేదు. కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తే అవకాశం లేదు.
ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్. లోకనాయకుడు కమల్ హాసన్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. నిర్మాత అశ్వినీ దత్ ప్రాజెక్ట్ కే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది.