
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరికొద్దిరోజులోనే బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది. పవన్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలయింది.
భీమ్లా నాయక్ ట్రైలర్ ధాటికి యూట్యూబ్ రికార్డ్స్ కుదేలవుతున్నాయి. కానీ పవన్ అభిమానుల్లో ఏదో అసంతృప్తి కనిపిస్తోంది. ట్రైలర్ కట్ చేసిన విధానం సరిగ్గా లేదని, సౌండ్ మిక్సింగ్ కుదర్లేదని కామెంట్స్ చేస్తున్నారు. అది కొంత వరకు వాస్తవమే. త్రివిక్రమ్ డైలాగ్స్ అంతగా పేలలేదు. పులి పెగ్గేసుకు పడుకుంది లాంటి డైలాగులు గతంలో త్రివిక్రమ్ పెన్ను నుంచి వచ్చినవే అనిపించాయి.
ఇక తమన్ తన బిజియంతో వండర్స్ క్రియేట్ చేస్తాడు అనుకుంటే.. అది కాస్త నిరాశపరిచే విధంగా ఉంది. దీనితో తమన్ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అసలు మ్యాటర్ సినిమాలో ఉందని అభిమానులకు భరోసా ఇచ్చాడు. కానీ ట్రైలర్ సౌండ్ మిక్సింగ్ లో లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది.
బిజియం మోతెక్కాల్సిన చోట చప్పగా సాగినట్లు అనిపించింది. టైం లేకపోవడం వల్ల ఇలా జరిగిందా అనే చర్చ కూడా జరుగుతోంది. షాదాబ్ రాయీమ్ లాంటి బెస్ట్ సౌండ్ ఇంజినీర్ ఉన్నపటికీ ఇలా జరగడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. యూట్యూబ్ వర్షన్ ట్రైలర్ లోనే ఇలా జరిగింది.
థియేటర్స్ లో భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన వారు మాత్రం అదిరిపోయింది అని అంటున్నారు. థియేటర్స్ లో సౌండ్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా భీమ్లా నాయక్ ట్రైలర్ తో మాత్రం ఫ్యాన్స్ 100 శాతం హ్యాపీగా లేరు. ఫిబ్రవరి 25న ఈ చిత్రం థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.