
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ15’.హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ పొటిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు శంకర్. గతేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఒక్కో షెడ్యూల్ పూర్తి చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టైటిల్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.
ఈ సందర్భంగా RC15 టైటిల్ పై తాజాగా ఓ క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న సందర్భంగా ప్రస్తుతం మేకర్స్, డైరెక్టర్ శంకర్ టైటిల్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ మూడు సాలిడ్ టైటిల్స్ ను పరిశీలించారట. వాటిలో ఆల్రెడీ ఓ టైటిల్ ను కన్ఫమ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫిషియల్ గా టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో టైటిల్ ఎలా ఉండనుందోనని అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు షెడ్యూళ్లను పూర్తి చేశారు దర్శకుడు శంకర్. కొంతకాలంగా అప్పుడప్పుడు వస్తున్న లీక్ లతో సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ తర్వాత చిత్రంపై మరింతగా అంచనాలు పెరగనున్నాయి. ఎందుకంటే శంకర్ తన ప్రతి సినిమాకు ప్రకటించే టైటిల్స్ సినిమాలోని సింహాభాగపు కథాంశాన్ని తెలిపేవిగా ఉంటాయి. నిర్మాత దిత్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పై 50వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.