అల్లు అర్జున్ కే షాకిచ్చిన కూతురు అల్లు అర్హా.. వైరల్ అవుతున్న ఫొటో.. ఏం చేసిందంటే?

By Asianet News  |  First Published Mar 21, 2023, 5:21 PM IST

అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. అయితే తాజాగా కూతురు టాలెంట్ చూసి బన్నీ షాక్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే. సమయం ఉన్నప్పుడల్లా కుటుంబ సభ్యుులతోనే గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. భార్య, పిల్లలతో వేకేషన్లు, టూర్లు, అలాగే నైట్ రైడ్స్ కు వెళ్తుంటారు. ఆ ఫొటోలు నెట్టింట చేరి తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి మాత్రం అల్లు అర్జున్ (Allu Arjun) కే తన కూతురు  అల్లు అర్హ షాక్చించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే బన్నీ భార్య అల్లు స్నేహా అందుకు సంబంధించిన ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకుంది. 

స్నేహా రెడ్డి పంచుకున్న ఫొటోలో అల్లు అర్హ తనలోని కొత్త టాలెంట్ ను బయటపెట్టింది. ఏకంగా తండ్రినే ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం చేసిందో ఈ ఫొటో చూస్తే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇలా కఠినమైన యోగాసనంతో అర్హా అల్లు అర్జున్ ఆశ్చర్యపరిచింది. అత్యంత కఠినమైన ధనురాసనంతో ఆకట్టుకుంది. తమ గార్డెన్ లో ఉదయమే అల్లు అర్హ యోగా చేస్తుండటం చూసి అల్లు అర్జున్ మురిసిపోయారు. ఇందుకు సంబంధించి ఫొటోలను అల్లు స్నేహా రెడ్డి బన్నీఫ్యాన్స్ తో పంచుకుంది. అ అల్లు అర్హ టాలెంట్ కు నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. రెండ్రోజుల కింద అర్హ స్కూల్ ఈవెంట్ లోనూ అల్లు అర్జున్, స్నేహా సందడి చేసిన విషయం తెలిసిందే.

Latest Videos

అల్లు అర్జున్ 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. ఈ క్యూట్ ఫ్యామిలీ దాదాపుగా తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసనే చెప్పాలి. ఇక రీసెంట్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి రణథంబోర్ నేషనల్ పార్క్‌లో టైగర్ సఫారీని ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు టూర్స్, వెకేషన్స్ కు వెళ్లారు. ఆ ఫొటోలను స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ వస్తోంది. 

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం Pushpa The Rule చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మరో షెడ్యూల్ కు సిద్దం అవుతున్నారు. బన్నీపుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న పవర్ ఫుల్ గ్లింప్స్ రానుందని ప్రచారం జరుగుతోంది. చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ, తదితర తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగతోనూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన  విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నటించే ఛాన్స్ ఉందంటున్నారు. 

 

click me!