దేవుడి అవతారంలో అల్లు అర్జున్?

By team telugu  |  First Published Aug 6, 2021, 12:26 PM IST


2020లో విడుదలైన తమిళ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఓ మై కడవులే మంచి విజయాన్ని అందుకుంది. అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన ఈ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు విజయ్ సేతుపతి. 


టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ మంచి పాత్ర అనిపిస్తే క్యామియో కూడా చేస్తారు. గతంలో ఆయన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డిగా కనిపించి అలరించారు. అలాగే రామ్ చరణ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎవడు చిత్రంలో అల్లు అర్జున్ క్యామియో పాత్ర చేయడం జరిగింది. మరోమారు ఈ తరహా పాత్ర చేస్తున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 
2020లో విడుదలైన తమిళ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఓ మై కడవులే మంచి విజయాన్ని అందుకుంది. అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా నటించిన ఈ మూవీలో ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశారు విజయ్ సేతుపతి. ఈ మూవీలో ఆయన దేవుడిగా కనిపించడం జరిగింది. అయితే ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 

Latest Videos


విశ్వక్ షేన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడి పాత్ర అల్లు అర్జున్ చేస్తున్నారని వినికిడి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ గట్టిగా ప్రచారం అవుతుంది. మరో వైపు పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ పూర్తి చేసే పనిలో అల్లు అర్జున్ ఉన్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 

click me!