వకీల్ సాబ్ ట్రైలర్.. పవన్ వాదనకు కోర్టు గోడలు బద్దలవ్వాసిందే!

Published : Mar 29, 2021, 06:49 PM IST
వకీల్ సాబ్ ట్రైలర్.. పవన్ వాదనకు కోర్టు గోడలు బద్దలవ్వాసిందే!

సారాంశం

అంగబలం అర్థ బలం ఉన్న ముగ్గురు యువకుల ట్రాప్ లో చిక్కుకున్న ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలను కాపాడడం కోసం ఓ లాయర్  పోరాటమే వకీల్ సాబ్ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. సమాజంలో ఆడవారు ఎలా ఉండాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఆధారంగా క్యారెక్టర్ ని జడ్జి చేయడం వంటి పోకడలు ఈ సినిమా ద్వారా చర్చించారని అర్థం అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా తన అవతారం శాంపిల్ చూపించాడు. వకీల్ సాబ్ ట్రైలర్ లో పవన్ దుమ్ము లేపాడు. కన్నింగ్ లాయర్ వలలో చిక్కిన అమాయకపు ఆడపిల్ల అభిమానం కాపడం కోసం కోటు దుమ్ము  దులిపి, కోర్టు గోడల్ని బీటలు వారేలా వాదనలతో కేక పుట్టించాడు. నేడు నేడు విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. 


అంగబలం అర్థ బలం ఉన్న ముగ్గురు యువకుల ట్రాప్ లో చిక్కుకున్న ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలను కాపాడడం కోసం ఓ లాయర్  పోరాటమే వకీల్ సాబ్ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. సమాజంలో ఆడవారు ఎలా ఉండాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఆధారంగా క్యారెక్టర్ ని జడ్జి చేయడం వంటి పోకడలు ఈ సినిమా ద్వారా చర్చించారని అర్థం అవుతుంది. ముఖ్యంగా  పవన్ ప్రత్యర్థుల లాయర్ గా చేసిన ప్రకాష్ రాజ్ తో పవన్ వాగ్వాదం రక్తి కట్టించేలా కనిపిస్తుంది . 
 

అలాగే పవన్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండనుంది. రెండు  నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్  సినిమాకు సంబంధించి కీలక విషయాలు చర్చించారని తెలుస్తుంది. న్యాయం దొరకక చట్టానికి ఎదురెళ్ల లేక ఇబ్బంది పడుతున్న యువతులుగా అంజలి, నివేదా థామస్ నటన అద్బుతంగా ఉంది. హిందీ పింక్ చిత్రానికి తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కగా, పవన్ కోసం చాలా మార్పులు చేశారని అర్థం అవుతుంది. 


పవన్ ఫ్యాన్స్ కోసం మాస్, కమర్షియల్ అంశాలు జోడించి ఓ సోషల్ మెస్సేజ్ కథను సిద్ధం చేశారు. ఇక ట్రైలర్ లో చెప్పుకోవాల్సిన మరొక అంశం థమన్ బీజీఎమ్. థమన్ మరోమారు బీజీఎమ్ లో సత్తా చాటారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు నిర్మించగా, ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల కానుంది.

PREV
click me!

Recommended Stories

Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Maheshbabu Reality: మహేష్‌ బాబు రియాలిటీ బయటపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. ఆయనతో వ్యవహారం అలా ఇలా ఉండదట