జర్నలిస్ట్ ఫోన్ లాక్కొని, గాయపరిచిన సల్మాన్.. కోర్టులో కేసు!

By AN TeluguFirst Published Sep 6, 2019, 4:40 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఫోన్ లాక్కొని.. తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తున్నాడు యువ జర్నలిస్ట్ అశోక్ పాండే.ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వివారాలు వెల్లడయ్యాయి. ఈ వివాదంలో సల్మాన్ తో పాటు అతడి గార్డులు కూడా అశోక్ పాండేని గాయపరిచారట.
 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఫోన్ లాక్కొని.. తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తున్నాడు యువ జర్నలిస్ట్ అశోక్ పాండే. తాను సైకిల్ పై వెళ్తుండగా.. సల్మాన్ కనిపిస్తే ఫోటోలు, వీడియోలు తీశానని.. దానికి బాడీ గార్డులు కూడా అనుమతించారని.. అయితే ఆ సమయంలో వీడియోలు తీయడం నచ్చని సల్మాన్ తన వద్దకు వచ్చి ఫోన్ లాక్కొని కొట్టారని చెప్పాడు.

ఫోన్ లో నుండి కొన్ని వీడియోలను డిలీట్ చేశారని.. ఈ విషయాన్నీ అంధేరీ.. డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని.. పోలీసుల వల్ల తనకు న్యాయం జరగకపోవడం వలన ఇప్పుడు కోర్టుని ఆశ్రయించినట్లు తెలిపాడు. ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వివారాలు వెల్లడయ్యాయి.

ఈ వివాదంలో సల్మాన్ తో పాటు అతడి గార్డులు కూడా అశోక్ పాండేని గాయపరిచారట. అలానే డీఎన్ నగర్ పోలీసులు కేసు స్వీకరించని కారణంగా వారిపై కూడా విచారణ సాగనుంది. ప్రస్తుతం ముంబై అంధేరీ కోర్టు ఈ కంప్లైంట్ ను స్వీకరించి పోలీసులను విచారించాల్సిందిగా ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మరి ఈ విషయంలో నిజానిజాలు తేలాల్సివున్నాయి. జర్నలిస్టుని గాయపరిచినందుకు ఐపీసీ సెక్షన్ 323,ఫోన్ లాక్కున్నందుకు 392, నేరానికి పాల్పడినందుకు ఐపీసీ 506 సెక్షన్ల కింద కోర్టులో సల్మాన్ పై కేసులు నమోదయ్యాయి. 

click me!