'సాహో'లో ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతో తెలుసా..?

Published : Apr 04, 2019, 02:38 PM IST
'సాహో'లో ప్రభాస్ వాడిన బైక్ ధర ఎంతో తెలుసా..?

సారాంశం

బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు. 

బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిపోయాడు. విదేశాల్లో కూడా అతడికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. అటువంటి సినిమా తరువాత ప్రభాస్.. దర్శకుడు సుజీత్ తో కలిసి 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు.

హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.150 నుండి 200 కోట్లు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.  కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

ఇందులో ప్రభాస్ స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి.. ఓ బైక్ రైడ్ చేస్తాడు. దానికోసం ట్రింప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్ అనే బైక్ ను ఉపయోగించారు. దుబాయ్ లో గతేడాది ఈ బైక్ తో కొన్ని యాక్షన్ స్టంట్స్ ని చిత్రీకరించారు. ఆ విధంగా వెలుగులోకి వచ్చిన ఈ బైక్ బాగా పాపులర్ అయిపోయింది.

హాలీవుడ్ లో చాలా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల కోసం ఈ బైక్ నే వినియోగించారు. ఇంతకీ ఆ బైక్ ధర ఎంతో తెలుసా..? రూ.10.55 లక్షలు. తెలుగు సినిమాల్లో ఈ బైక్ పెద్దగా కనిపించనప్పటికీ హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ బైక్ ని ప్రభాస్ తన సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?