పవన్‌ `వకీల్‌సాబ్‌` టీమ్‌ని వెంటాడుతున్న కరోనా భయం ?

Published : Apr 04, 2021, 03:02 PM IST
పవన్‌ `వకీల్‌సాబ్‌` టీమ్‌ని వెంటాడుతున్న కరోనా భయం ?

సారాంశం

కరోనా కారణంగా `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందుగా అనుమతివ్వలేదు పోలీస్‌ అధికారులు. ఎట్టకేలకు అనేక నిబంధనలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నటించిన నివేదా థామస్‌కి కరోనా పాజిటివ్‌ రావడం ఇప్పుడు చిత్ర బృందాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. 

పవన్‌ రీఎంట్రీ చిత్రం `వకీల్‌సాబ్‌` అన్ని అడ్డంకులను దాటుకుని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ రోజు(ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందుగా అనుమతివ్వలేదు పోలీస్‌ అధికారులు. ఎట్టకేలకు అనేక నిబంధనలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నటించిన నివేదా థామస్‌కి కరోనా పాజిటివ్‌ రావడం ఇప్పుడు చిత్ర బృందాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. 

నివేదా థామస్‌కి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె హోం క్వారంటైన్‌ అయిపోయారు. తాను హాజరు కావాల్సిన ప్రెస్‌మీట్‌లు కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు. అయితే ఇటీవల వీరంతా ఫైనల్‌ మిక్సింగ్‌ కోసం కలిశారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌, కీలక పాత్రల్లో  నటిస్తున్న అంజలి, నివేదా, అనన్య నాగళ్ల ఈ మిక్సింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ట్విట్టర్‌ ద్వారా దర్శక, నిర్మాతలు తెలిపారు. మూడు రోజులు ముందే వీరంతా కలవడంతో, మిగిలిన వారిలో కూడా కరోనా భయం నెలకొంది. 

సినిమా విడుదలకు ముందు ఇదేం ట్విస్ట్ అని చిత్ర యూనిట్‌ టెన్షన్‌ పడుతున్నట్టు టాక్‌. కరోనా నిర్ధారణ కావడానికి దాదాపు పది రోజుల సమయం తీసుకుంటుంది. ఆ లోపు వీళ్లు ఎవరెవరిని కలిశారు, ఎవరికి కరోనా సోకుతుందో అనే ఆందోళన యూనిట్‌లో నెలకొన్నట్టు టాక్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు
అమ్మాయిల దుస్తులపై శివాజీ వల్గర్ కామెంట్స్...చిన్మయి, అనసూయ స్ట్రాంగ్ కౌంటర్