వివాదంలో మహేష్ బాబు!

Published : May 10, 2018, 03:54 PM IST
వివాదంలో మహేష్ బాబు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయాన్ని సొంతం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి తన నటన అందరినీ మెప్పించారు. నిజానికి సినిమాలో మహేష్ పార్టీ మనుషులే ఆయన్ను ఇబ్బందుల్లో పడేస్తారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో అదే పార్టీ చిత్రబృందాన్ని సమస్యలలో నెట్టేసింది. 

నిజానికి ఈ సినిమా కోసం ఉపయోగించిన రాజకీయ పార్టీ పేరు, గుర్తు తమదేనని నవోదయం పార్టీ అధ్యక్షుడు దారి రాము వెల్లడించారు. ఎన్నికల గుర్తింపు కూడా ఉన్న తమ పార్టీ పేరుని సినిమాలో ఎలా వాడతారని ఆయన ఆగ్రహం చెందారు. ఈ విషయంపై ఆయన దర్శకనిర్మాతలకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. మరి ఈ వివాదం నుండి మహేష్ అండ్ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Trigun Vs Rohith: నక్కలని కొట్టాలంటే నక్కలాగే మారాలి, రోహిత్ పై త్రిగుణ్..చెంప పగులుద్ది, బయట చూసుకుందాం
Vijay Rashmika: విజయ్ దేవరకొండ బాల్యంలో గడిపిన స్థలం.. పుట్టపర్తిలో రష్మిక ప్రత్యేక పూజలు, ఫోటోస్ ఇవిగో