పవన్‍,క్రిష్ సినిమాలకు భలే ప్రాబ్లమ్ వచ్చిందే?!

Surya Prakash   | Asianet News
Published : Nov 01, 2020, 02:37 PM IST
పవన్‍,క్రిష్ సినిమాలకు భలే ప్రాబ్లమ్ వచ్చిందే?!

సారాంశం

 పవన్‍కళ్యాణ్‍తో క్రిష్  మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి స్టార్ట్ అవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అలా జరిగే అవకాసం లేదనేది గ్రౌండ్ లెవిల్ రిపోర్ట్. అందుకు కారణం ఆ సినిమా చేసే సమయంలో వేరే ప్రాజెక్టులు ఏమీ చేయలేని పరిస్దితి. చేస్తే కంటిన్యుటి ప్లాబ్లం వస్తుంది. అంటే గెటప్ ఇబ్బంది వస్తుంది.   


క్రిష్‍,వైష్ణవ్ తేజ కాంబినషన్ లో రూపొందుతున్న ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్‍ దాదాపు పూర్తి అవడంతో పవన్‍కళ్యాణ్‍తో  మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి స్టార్ట్ అవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అలా జరిగే అవకాసం లేదనేది గ్రౌండ్ లెవిల్ రిపోర్ట్. అందుకు కారణం ఆ సినిమా చేసే సమయంలో వేరే ప్రాజెక్టులు ఏమీ చేయలేని పరిస్దితి. చేస్తే కంటిన్యుటి ప్లాబ్లం వస్తుంది. అంటే గెటప్ ఇబ్బంది వస్తుంది. 

సాధారణంగా స్టార్ హీరోలు గెటప్స్ చేంజ్ చేయడం అనేది ఉండదు. ఏ సినిమాలో అయినా ఒకే విధంగా వుంటారు. కాస్ట్యూమ్స్ చేంజ్ ఉంటుంది కానీ ఆహారం మాత్రం అలాగే ఉంటుంది.ఎక్కడో ఏ చరిత్ర  చిత్రమో చేస్తున్నప్పుడు గెటప్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.ఆ మధ్యన చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా లో గెటప్ పూర్తిగా మార్చి కనిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వచ్చింది. ఆయన ఓ చారిత్రక కాల్పనిక చిత్రం చేయబోతున్నారు.ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో రూపొందే ఈ సినిమాలో పెరిగిన జుట్టుతో జులపాలు వంటి హెయిర్ స్టైల్ తో పవన్ ఉంటారు. దొంగగా ఆయన క్యారక్టరైజేషన్ కు తగ్గట్లు ఆ గెటప్ ,లుక్ ఉండనుంది.

అయితే పవన్ కేవలం క్రిష్ ఒక్క సినిమానే చేస్తే ఏ ఇబ్బంది లేక పోను. కానీ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న వకీల్ షాప్ లో ఆయన లాయర్ గా కనబడతారు. కేవలం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మాత్రమే పవన్ కళ్యాణ్ గెటపు్ మారుస్తారు. ఆ సీన్స్ కూడా  ఇప్పుడు కాలానికి సంబంధించినవి కావటంతో పెద్దగా సమస్య రాదు. అలాగే ఆ తర్వాత పవన్ కళ్యాణ్  ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్ సినిమా లోకి మారతారు. ఆ లుక్ కూడా పోలీసు గెటప్. అది ఈ కాలానికి చెందినది కాబట్టి పెద్దగా సమస్య లేదు. ఎటొచ్చి క్రిష్ సినిమా కే జానపద కాలం నాటి గెటప్ లోకి మారాల్సి ఉంటుంది. 

దాంతో కొద్ది కాలంపాటు క్రిష్ సినిమా పక్కన పెడదామా అని పవన్ ఆలోచిస్తున్నారట.ప్రస్తుతం వకీల్ సార్ పూర్తి చేసి  ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్ సినిమా కూడా పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. కంటిన్యూగా వేరే సినిమాలు చేయగలం గాని క్రిష్ సినిమా చేయలేమని పవన్ భావిస్తున్నాడట. కాబట్టి ఆ ప్రాజెక్టు లేటవుతుంది.  దసరా రిలీజ్ కు వచ్చేలా క్రిష్ సినిమా ని రెడీ చేసే అవకాశం ఉంది .ఇక  హరీష్ శంకర్ సినిమా 2022 సమ్మర్ కి రెడీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ లోగా పవన్ రాజకీయాల్లోనూ బిజీ అవుతారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?