బిగ్ బాస్ లీక్: ఈ వారం హౌస్ నుండి బయటికి వచ్చేది ఎవరంటే..!

Published : Nov 01, 2020, 02:23 PM IST
బిగ్ బాస్ లీక్: ఈ వారం హౌస్ నుండి బయటికి వచ్చేది ఎవరంటే..!

సారాంశం

నేడు ఆదివారం కావడంతో బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా నోయెల్ నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిపోగా నేడు ఎలిమినేషన్ లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.


ఒకవారం బిగ్ బాస్ హౌస్ ని మిస్సైన హోస్ట్ నాగార్జున ఈ వారం రంగంలోకి దిగిపోయారు. బిగ్ బాస్ షూటింగ్ కోసం నాగార్జున కులుమనాలి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రావడం విశేషం. ఇక ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైపోగా నిన్న అఖిల్, లాస్య సేవ్ కావడం జరిగింది. ఎలిమినేషన్ కి మొత్తం ఆరుగురు నామినేట్ కాగా,మోనాల్, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ మరియు ఆరియానా మిగిలారు. వీరిలో ఒకరు నేడు హౌస్ నుండి బయటికి వెళ్లిపోనున్నారు. 

ఐతే ఈ నలుగురు కంటెస్టెంట్స్ లో అతి తక్కువ ఓట్లు అమ్మ రాజశేఖర్ పొందారని ప్రచారం జరుగుతుంది. నేడు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పోయేది ఆయనే అని అంటున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దీనికి కారణం అని సమాచారం. అమ్మ రాజశేఖర్ కొన్ని సంధర్భాలలో చెడ్డగా ప్రోజెక్ట్ అయ్యారు. బిగ్ బాస్ బేబీ కేర్ టాస్క్ లో హారిక జేబులో చేయిపెట్టి చాక్లెట్ తీసుకోవడం కొంచెం వివాదాస్పదం అయ్యింది. దానిని ఆయన మరలా సమర్ధించుకోవడం జరిగింది. 

దానితోడు ప్రస్తుతం ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో వీక్ గా ఉంది అమ్మ రాజశేఖర్ మాత్రమే. కాబట్టి ఎనిమిదవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళేది అమ్మ రాజశేఖర్ అని అంటున్నారు. మరి దీనిపై మరో కొన్ని గంటలలో క్లారిటీ రానుంది. ఆరోగ్య కారణాలతో నిన్న నోయల్ బిగ్ బాస్ హౌస్ కి శాశ్వతంగా బై చెప్పిన సంగతి తెలిసిందే. నేడు మరొకరి ఎలిమినేషన్ తో హౌస్   మరింత ఖాళీ కానుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?