ఆదిపురుష్ ని వదలని వివాదాలు, మరో చిక్కుల్లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా..

Published : Apr 11, 2023, 01:33 PM IST
ఆదిపురుష్ ని వదలని వివాదాలు, మరో చిక్కుల్లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా..

సారాంశం

ఇప్పటికే ఆదిపురుష్ సినిమాపై నెగెటీవ్ టాక్ ఎంతో ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్  ఈమూవీ మేకర్స్ పై బాగా కోపంగా కూడా ఉన్నారు. ఈక్రమంలోనే  ఆదిపురుష్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.   


 ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్.. సీతగాకృతిసనన్,  సైఫ్ అలీఖాన్  రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. ఆదిపురుష్ పై పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈసినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడని తెలసి.. ఆడియన్స్ చాలా ఉహించుకున్నారు. ఆరడుగుల అందగాడు ప్రభాస్.. రాముడిగా అద్భుతంగా ఉంటాడు అని అనుకున్నారంతా.  


కాని ఆదిపుష్ టీజర్ చూసిన తరువాత  ఆడియన్స్ అప్పటి వరకూ ఊహించుకున్న కిక్క్ అంతా... ఒక్క సారిగా దిగిపోయింది. టీజర్ చూసి షాక్ అవ్వడంతో పాటు  అంతా ఆశ్చర్యపోయారు. అద్భుతమైన మైథలాజికల్ మూవీ. ప్రభాస్ రాముడిగా..యుథ్ధ సన్నీవేశాలు రియల్టిగ్ గా చేసి.. చరిత్ర సృష్టిస్తారు అనుకుంటే.. బొమ్మలాటలా చేసి టీజర్ ను వదిలారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్... ఆదిపురుష్ మేకర్స్ పై మండిపడ్డారు. అటు ప్రభాస్ కూడా ఈ విషయంలో కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస వివాదాలు ఫేస్ చేస్తున్న ఆదిపురుష్ ను ఇంకో కొత్త సమస్య పట్టుకుంది. 

తాజాగా ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో నిలిచింది. ప్రతీక్ అనే ఓ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనర్ ఆదిపురుష్ టీం తన డిజైన్స్ ని, డ్రాయింగ్స్ ని కాపీ కొట్టిందని ఆరోపించాడు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ తన గీసిన కొన్ని రాముడి ఫోటోలను సోషల్ మీడియాలో శేర్ చేవారు.  నేను ఇండియాకు చెందిన ఆర్టిస్ట్ ని. రామాయణంలో శ్రీరాముడిని నా ఊహల్లో కొత్తగా రూపొందించుకుని..  సరికొత్త రాముడి బొమ్మలు గీశాను. ఇవి అవే.. కాని నేను ఏడాది క్రితం కీసిన బొమ్మలను..ఆదిపురుష్ టీంలో పనిచేసే  ఆర్టిస్ట్ TP విజయన్ నాతో ఉన్న పరిచయంతో.. నాదగ్గర ఉన్నట్టు ఉంది..  ఆర్ట్ ని కాపీ కొట్టారు. 

అంతే కాదు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అసలు నా అనుమతి లేకుండా నా ఆర్ట్ ను దొంగిలించి ఆదిపురుష్ కు వాడారు అంటూ మండిపడ్డారు. ఇక ఈ విషయంలో బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఆదిపురుష్ పై నెగిటివ్ ఉండటంతో కొంతమంది ప్రతీక్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండగా, మరికొంతమంది మాత్రం ఆదిపురుష్ సినిమా రెండేళ్ల క్రితమే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది, నువ్వు సంవత్సరం క్రితం గీశావని చెప్తున్నావ్ అంటూ ప్రతీక్ కి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ప్రతీక్, TP విజయన్ పోస్ట్ చేసిన రాముడు బొమ్మలు రెండూ ఒకేలా ఉన్నాయి. కాకపోతే  ప్రతీక్ సంవత్సరంన్నర క్రితమే తన సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేయగా, TP విజయన్ కొన్ని నెలల క్రితం వీటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నిజంగానే కాపీ కొట్టారా అని అంతా అనుకుంటున్నారు. మరి దీనిపై  ఆదిపురుష్ టీమ్ కాని.. TP విజయన్ కానీ  స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా బిజీగా నడుస్తుండగా.. రిలీజ్ కు ముస్తాబయ్యింది ఆదిపురుష్ సినిమా. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే