
మూడు వారాలుగా నిహారిక కొణిదెల విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. తాజాగా నిహారిక ఈ చర్యకు పాల్పడ్డారు. ఇద్దరికీ నచ్చజెప్పాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని, నిహారిక-వెంకట చైతన్య విడాకులకు సిద్దమయ్యారనే ప్రచారం ఊపందుకుంది.
విడాకుల వార్తల మధ్య నిహారిక నిర్ణయం అందరినీ ఆకర్షించింది. ఆమె హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు.
తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఇక నిహారిక ప్రయత్నం సక్సెస్ కావాలని. తన బ్యానర్లో హిట్ చిత్రాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక న్యూ ఆఫీస్ ఓపెనింగ్ చేయడంతో కొన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, నిర్మాతగా రాణించాలని నిర్ణయించుకున్నారుని అంటున్నారు.
చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత కూడా నిర్మాతగా మారారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి నిహారిక. ఈమె నిర్ణయాన్ని మెగా ఫ్యాన్స్ హర్షించలేదు. చెప్పాలంటే ఫ్యామిలీ నుండి కూడా పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. 2020 డిసెంబర్ 9న జొన్నలగడ్డ వెంకట చైతన్యను ఆమె వివాహం చేసుకున్నారు.