
ప్రముఖ నటుడు, కమెడియన్ విశ్వేశ్వరరావు కణ్ణముశారు. ఆయన వయసు 62 ఏళ్లు. విశ్వేశ్వరరావు. కొన్నాళ్లుగా విశ్వేశ్వరరావు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 2 మంగళవారం విశ్వేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని ధృవీకరించారు. అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని చెన్నై సిరుశేరి గ్రామంలో గల ఆయన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నారని సమాచారం.
విశ్వేశ్వరరావు చైల్డ్ ఆర్టిస్ట్ గా 6 ఏళ్ల వయసులో కెరీర్ మొదటుపెట్టాడు. 150కి పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు చేశాడు. కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ముఠామేస్త్రి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, మెకానిక్ అల్లుడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ప్రెసిడెంటు గారి పెళ్ళాం, శివాజీ వంటి చిత్రాల్లో ఆయన కీలక రోల్స్ చేశారు. తెలుగు, తమిళ్ చిత్రాల్లో ఆయన ఎక్కువగా నటించారు.
అవకాశాలు తగ్గాక విశు టాకీస్ పేరుతో యూట్యూబ్ లో ఒక షో చేశారు. టాలీవుడ్ లో గతంలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు సదరు షోలో ప్రేక్షకులతో పంచుకునేవాడు. విశ్వేశ్వరరావు మరణవార్తతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.