చంపుతామని బెదిరించారు.. నటి శరణ్యపై కేసు, సినిమా ట్విస్ట్ ఏంటంటే..?

Published : Apr 02, 2024, 11:41 AM IST
చంపుతామని బెదిరించారు.. నటి శరణ్యపై కేసు, సినిమా ట్విస్ట్ ఏంటంటే..?

సారాంశం

తెలుగు తమిళ సినిమాలతో బాగా ఫేమస్ అయిన శరణ్య గుర్తుండే ఉంటుంది. అమ్మపాత్రలకు పేరుగాంచిన ఆమెపై చెన్నెై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తమను చంపాలని చూశారంటూ..ఓ ఫ్యామిలీ ఆమెపై కేసు పెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

తమిళ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శరణ్య పొన్వన్నన్. తమిళ పరిశ్రమలో కమల్ హాసన్ నటించిన నాయగన్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది శరణ్య.  ఆతరువాత వరుసగా హీరోయిన్ గా అలరించిన శరణ్య.. ఆతరువాత కాలంలో తల్లి పాత్రలవైపు వెళ్లిపోయారు. ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించిన శరణ్య.. తల్లి పాత్రలు పోషించిన చిత్రాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలుగా ఉన్న విజయ్, అజిత్ మొదలుకొని పలువురు ప్రముఖ నటులకు తల్లిగా శరణ్య పొన్వణ్ణన్ నటిస్తోంది.

ఈ నేపథ్యంలో శరణ్యపై  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నటి శరణ్య చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్‌లో నివసిస్తున్నారు. ఆమె  ఇంటి సమీపంలోనే ఉంటున్న శ్రీదేవి అనే ఆవిడ.. శరణ్యపై కేసు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏంటంటే.. శ్రీదేవి నిన్న రాత్రి ఆసుపత్రికి వెళ్లేందుకు తన కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, గేటు తెరుస్తుండగా పక్కనే ఆగి ఉన్న శరణ్య కారును ఢీకొట్టింది. దాంతో కారు డామేజ్ అవ్వడం.. నటి శరణ్య, శ్రీదేవి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరగడంతో శరణ్య కుటుంబీకులై  శ్రీదేవి పోలీసు కేసు పెట్టారు. 

శరణ్య బంధువులు తన  ఇంట్లోకి వెళ్లి తనను అనుచిత పదాలతో దూషించారని, చంపేస్తామని బెదిరించారని శ్రీదేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై శ్రీదేవి విరుగంపాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించిన నటి శరణ్య పొన్‌వణ్ణన్‌పై చర్యలు తీసుకోవాలని శ్రీదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని శ్రీదేవి తెలిపారు. ఘటనపై విరుగంపాక్కం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఇటీవల విడుదలైన పార్కింగ్ సినిమాతో పోలుస్తూ.. కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

PREV
click me!

Recommended Stories

Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
Nagarjuna Dream Role: నాగార్జున డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? రాజమౌళిని భలే ఇరికించాడుగా